నామినేషన్స్‌లో యావర్ అతి… ప్రశాంత్ సిల్లీ రీసన్స్..!!

” బిగ్ బాస్ ” మూడో వారంలోకి అడుగుపెట్టేశాడు. షకీలా ఎలిమినేట్ అయ్యి, బయటికి వెళ్లడంతో కాస్త ఎమోషనల్ అయినా ఇంటి సభ్యులు… నామినేషన్స్ వచ్చేసరికి మళ్ళీ ఎనర్జీతో కనిపించారు. ఒకరిపై ఒకరు అరుస్తూ, బాగానే హడావిడి చేశారు. ఈవారం కూడా ఏడుగురు నామినేషన్స్ లో నిలవగా, చివరలో బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. అయితే 14వ రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం.

షకీలా ఎలిమినేట్ అయ్యి, హౌస్ నుంచి బయటికి వెళ్లడంతో ఆదివారం ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. అక్కడి నుంచి సోమవారం ఎపిసోడ్ షురూ అయ్యింది. బెడ్ రూమ్ లో దామిని, ప్రియాంక, ప్రిన్స్ యావర్ గురించి మాట్లాడుకుంటున్నారు. అతడి ప్రవర్తన నచ్చలేదని అంటున్నారు. నిద్రపోయే లేచేసరికి సోమవారం వచ్చింది. నేరుగా సుత్తి లేకుండా నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. హౌస్ లో అనర్హులు అనిపిస్తున్న ఇద్దరినీ నామినేట్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు.

ఎవరు ఎవరిని నామినేట్ చేశారు:

• ప్రియాంక-యావర్, గౌతమ్

• ప్రశాంత్-తేజ, దామిని

• శోభ శెట్టి- శుభశ్రీ, రతిక

• అమర్ దీప్- గౌతమ్, శుభశ్రీ

• రతిక- గౌతమ్, శుభశ్రీ

• తేజ-ప్రశాంత్, గౌతమ్

• యావర్-ప్రియాంక, దామిని

• దామిని-యావర్, శుభశ్రీ

• గౌతమ్- రతిక-అమర్ దీప్

• శుభశ్రీ- తేజ, ప్రియాంక

అతి చేసిన యావర్:
అమర్ దీప్, రతిక, యావర్.. తమ తమ నామినేషన్స్ ని పెద్దగా హడావిడి లేకుండా ముగించేశారు. అయితే దామిని.. తనని నామినేట్ చేసేసరికి ప్రిన్స్ యావర్ తట్టుకోలేకపోయాడు. అలానే ఆమె చెప్పేది అతడికి సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల వేరేది అనుకుని హడావిడి చేశాడు. ఇక శుభశ్రీ అయితే దానిని టార్గెట్ చేస్తుందని ఈ విషయాన్ని ఆమెతోనే చెప్పింది.

చివర్లో ట్విస్ట్:
మిగిలిన వ్యక్తులలో గౌతమ్, శుభ శ్రీ కూడా తమ తమ నామినేషన్స్ ని సింపుల్ గానే ముగించేశారు. దీంతో ఈ వారం నామినేషన్ లో తొలుత శుభశ్రీ, గౌతమ్, తేజ, ప్రియాంక, దామిని, రతిక, యావర్ నిలిచారు. అయితే చివర్లో ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్… పవరస్త్ర గెలుచుకున్న శివాజీ, సందీప్ లకు ఓ టాస్క్ ఇచ్చాడు. లాస్ట్ లో ఒకరిని సేవ్ చేసి, సేఫ్ గా ఉన్న వాళ్ళని నామినేట్ చేయాలని అన్నారు. దీంతో ఇద్దరూ అనుకుని తేజాని సేవ్ చేసి, అతడి ప్లేస్ లో అమర్ దీప్ ని నామినేట్ చేశారు. అలో ఏడుగురు నామినేషన్స్ లో నిలవడంతో సోమవారం ఎపిసోడ్ పూర్తయింది.