స్టైల్ మార్చిన యాంకర్ ప్రదీప్.. మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకి.‌.!!

బుల్లితెరపై పలు షోస్ లో తనదైన స్టైల్ లో ప్రేక్షకులని అలరిస్తూ… తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గతంలో ప్రదీప్ హీరోగా ” 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ” సినిమాలో నటించాడు.
కానీ ఈ సినిమా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయింది.

దీంతో కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని ప్రదీప్ ప్రస్తుతం రొమాంటిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతున్నారట. అలాగే ఓ స్టార్ దర్శకుడి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట.. ఈ మూవీలో నటించే నటీనటులు ఎవరో త్వరలోనే తెలియనున్నట్లు సమాచారం.