టాలీవుడ్ స్టార్ హీరోని నమ్మించి దారుణంగా మోసం చేసిన కత్రినా.. కట్ చేస్తే..

ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు విక్టరీ వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి’ అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత కత్రినాకి తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉండగా కత్రినా కైఫ్ ఒక తెలుగు హీరోని దారుణంగా మోసం చేసిందట. అసలు ఆ హీరో ఎవరు కత్రినా అతని ఎందుకు మోసం చేసింది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అసలు విషయంలోకి వెళ్తే టాలీవుడ్ ఇండస్ట్రీ లో విక్టరీ వెంకటేష్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా వెంకటేష్ ఎలాంటి గొడవలో దూరకుండా చాలా సమరస్యంగా సమస్యలను పరిష్కరిస్తుంట్టాడు. అలాంటి వెంకీ ని కత్రినా కైఫ్ దారుణం గా మోసం చేసిందని సమాచారం. వెంకటేష్, కత్రినా కాంబో లో వచ్చిన ‘ మల్లేశ్వరి ‘ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో కత్రినా కి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తరువాత ఈ అమ్మడు టాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ వెంకటేష్ తో మాత్రం సనిహితం గానే ఉంది. ఆ తరువాత కొన్ని రోజులకి వెంకటేష్ ‘ ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ‘ సినిమా ఒప్పుకున్న సమయం లో దర్శకుడు సెల్వ రాఘవన్ హీరోయిన్ గా ఎవరిని తీసుకుందాం అని వెంకటేష్ ని అడిగితే కత్రినా ని తీసుకుందాం ఆమెతో నేను మాట్లాడి ఓపిస్తా అని మాటిచ్చాడట.

అదే విషయాని వెంకటేష్, కత్రినా తో చెప్తే ఆమె కచ్చితంగా చేదాం షూటింగ్ స్టార్ట్ చెయ్యండి అని డేట్స్ కుడా ఇచ్చిందట. దాంతో సెల్వ రాఘవన్ షూటింగ్ కోసం అంత ప్లాన్ చేసి మొదటి షాట్ ని వెంకీ, కత్రినా ల మధ్య ప్లాన్ చేసారట. షూటింగ్ సమయానికి హీరో, డైరెక్టర్ సెట్స్ దెగ్గరకి వచ్చారు కానీ హీరోయిన్ మాత్రం రాలేదు. దాంతో వెంటనే కత్రినా మేనేజర్ కి డైరెక్టర్ ఫోన్ చేసి అడగగా వేరే సినిమా కి డేట్స్ ఇచ్చింది, మీ సినిమా చేయట్లేదు అని చెప్పి కాల్ చేసాడట. దాంతో సెల్వ రాఘవన్ కి కోపం వచ్చి విషయాన్ని వెంకటేష్ కి చెప్పగా ‘ సినిమా చెయ్యడం ఇష్టం లేకపోతే ఇష్టంలేదు అని ముందే చెప్పాలి కానీ ఇదేం పద్దతి ‘ అంటూ అప్పటినుండి వెంకటేష్, కత్రినా తో మాట్లాడం మానేసాడట. ఆ తరువాత ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమా లో త్రిష ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా మంచి హిట్ అయింది.