హిట్ అయినదే పెద్ద సినిమా.. హీరో శ్రీ‌కాంత్ కామెంట్స్ వైర‌ల్..!!

” రుద్రం కోట ” మూవీ ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి. ఇప్పుడు ఏది హిట్ అయితే అదే పెద్ద సినిమా అవుతుంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి.. కొత్తవారిని ప్రోత్సహించాలి ” అన్నారు నటుడు శ్రీకాంత్. రుద్ర హీరోగా, శక్తి, విభీష హీరోయిన్లుగా రాము కోన దర్శకత్వం వహిస్తున్న మూవీ ” రుద్రం కోట “.

నటి జయలలిత కీలకపాత్రలో నటించి, సమర్పించారు. అనిల్ అర్కా కొండవల్లి నిర్మించిన ఈ సినిమా.. ఈనెల 22న స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైలర్ ని శ్రీకాంత్, నటి రాశీ విడుదల చేశారు.

రాశీ మాట్లాడుతూ ” రుద్రం కోట ” టీజర్, ట్రైలర్ బాగున్నాయి. సినిమా విజయం సాధించాలి”. అన్నారు. ” మా సినిమాను సక్సెస్ చేసుకోవడానికి కృతజ్ఞతలు” అన్నారు జయలలిత. ” ప్రేక్షకులు మా సినిమాని ఆదరించి పెద్ద సినిమాగా చేస్తారని ఆశిస్తున్నాను ” అన్నారు అనిల్ ఆర్కా.