ఆ విష‌యంలో మ‌హేష్‌, ప‌వ‌న్ ను కొట్టేవారే లేరు.. మిగిలిన హీరోలంతా వారి ముందు జోక‌ర్సే!

టాలీవుడ్ టాప్ స్టార్స్ లిస్ట్ తీస్తే మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్లు ముందు వ‌రుస‌లో ఉంటాయి. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ కు తోడు త‌మదైన టాలెంట్ తో ఈ ఇద్ద‌రు హీరోలు స్టార్ ఇమేజ్ ను ద‌క్కించుకున్నారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. సెలెక్టివ్ గా సినిమాల‌ను ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అలాగే రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాన్ ను కొట్టేవారే లేదు.

వీరిద్ద‌రూ ఒక్కో సినిమాకు రూ. 80 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తున్నారు. వీరి ముందు మిగిలిన టాలీవుడ్ హీరోలంతా జోక‌ర్సే అంటున్నారు. ఎందుకంటే ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ వంటి హీరోలు పాన్ ఇండియా స్టార్స్ అయ్యాకే ఆ రేంజ్ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారు. కానీ, మ‌హేష్ బాబు, ప‌వ‌న్ కళ్యాణ్‌.. ఇద్ద‌రూ ఇంతవ‌ర‌కు పాన్ ఇండియా సినిమాల్లో న‌టించ‌లేదు.

క‌నీసం ఇత‌ర భాష‌ల్లో కూడా సినిమాలు చేయ‌లేదు. అయినా కూడా టాలీవుడ్ లో ఈ ఇద్ద‌రూ ఎన‌భై కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు. కేవలం తెలుగు వెర్షన్ సినిమాల్లో మాత్రమే ఇప్పటివరకు నటించినా.. ఈ స్థాయిలో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరోలు పవన్, మహేష్ మాత్రమే అని నెటిజ‌న్లు, అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా, మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ తో `గుంటూరు కారం` చేస్తున్నాడు. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.