రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న మంచు ల‌క్ష్మి.. ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి కాల్‌..!!

మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆమె నటించిన కొన్ని సినిమాలే అయినప్పటికీ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇకపోతే తాజాగా మంచు లక్ష్మికి ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది.

ప్రధాని నరేంద్ర మోదీని గురువారం మంచు లక్ష్మి కల్వబోతున్నట్లు తెలుస్తుంది. గతంలోను మోదీ, మోహన్ బాబు చాలాసార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో బీజీపీలోకి మంచు లక్ష్మిని ఆహ్వానించడానికి ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి పిలుపు అందిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది మాత్రమే కాకుండా మహిళా బిల్లును కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో పేరున్న.. ఎంతోమంది మహిళలను పిలిచి మాట్లాడుతున్నారని అందులో భాగంగానే మంచు లక్ష్మి ని కూడా ఆహ్వానించారని తెలుస్తుంది.