చంద్రముఖి 2 తెలుగు రాష్ట్రాల రైట్స్ సొంతం చేసుకున్న ఆ ప్రముఖ సంస్థ..!

యాక్టర్, డైరెక్టర్, డాన్స్ మాస్టర్ ఇలా మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అయినా రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల లారెన్స్ హీరోగా బాలీవుడ్ నటి కంగనా రనోత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హర్రర్ యాక్షన్ పాన్ ఇండియన్ థ్రిల్లర్ మూవీ చంద్రముఖి 2. సీనియర్ దర్శకుడు పి.వాసు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించాడు. ఈ మూవీకి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించుగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, టైలర్ అన్ని కూడా ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ లో అందుకున్నాయి. మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలను ఏర్పరిచాయి. ఇక సెప్టెంబర్ 28న గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ సంస్థ శ్రీ లక్ష్మీ మూవీస్ వారు గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయంపై మేకర్స్ తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

వడివేలు, రావు రమేష్, విగ్నేష్, రాధిక, శరత్ కుమార్, లక్ష్మీ మీనన్, రవిమరియా, సృష్టి డాంగే, వైజీ మహేంద్రన్, మహిమా నంబియర్ ఇలా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఇలా చాలామంది సినీ ప్రముఖులు ఈ సినిమాలో నటించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.