ఆ హీరోతో ఫ‌స్ట్ టైం అలా చేసేందుకు సై అన్న ర‌ష్మిక‌…!

యంగ్ అండ్ మాస్ డైరెక్ట్ గోపీచంద్ మల్లినేని మరోసారి కొత్త కాంబినేషన్ మూవీకి రెడీ అవుతున్నాడు. మాస్ మహారాజు రవితేజ – నేషనల్ క్రష్‌ రష్మిక లను జోడిగా సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మైత్రి మూవీస్ బ్యానర్ పై గోపీచంద్ మల్లినేని వరుసగా రెండు సినిమాల్లో రూపొందించబోతున్నాడు. ఈ సినిమా మొద‌ట్లో శ్రీ లీలను తీసుకుని ధమాకా కాంబినేషన్ రిపీట్ చేస్తారనే వార్తలు వినిపించాయి.

కానీ ఇప్పుడు ఈ సినిమాకు రష్మిక – రవితేజ కాంబోను ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి నటించలేదు. ఖచ్చితంగా ఇది ఓ అదిరిపోయే కాంబినేషన్ అవుతుందని అనుకుంటున్నారట. ఇక రష్మిక వరుసగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ పుష్ప 2 సెట్ మీద ఉంది. ఇప్పుడు ఈ సినిమాకి కూడా రష్మీక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని న్యూస్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీ కూడా మైత్రి బ్యానర్స్ పై దసరాకు షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక అప్పటినుంచి ఈ మూవీ నాన్‌స్టాప్ గా షూటింగ్ జరుగుతుంది.

ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలకు రెడీగా ఉంది. అలాగే ఈగల సినిమా పూర్తయింది. ఈ రెండు సినిమాల తరువాత రవితేజ చేస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం రవితేజ నటించిన ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలు రిలీజై హిట్ అయితే ఇక నెక్స్ట్ రష్మిక – రవితేజ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు కూడా మార్కెట్ బానే ఉంటుందని టాక్‌. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎలా ఉంటుందో అని ఆసక్తి ప్రేక్షకుల్లో కూడా నెలకొంది.