అట్లి పై నయనతార సీరియస్… బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటానంటూ నయన్ షైర్‌..!!

సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది నయనతార. తెలుగుతో పాటు తమిళ్లో దాదాపు అందరు అగ్ర హీరోలతో కలిసి నటించింది. తాజాగా ” జవాన్ ” సినిమాలో షారుక్ ఖాన్ సరసన నటించి.. బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీ రూ. 90 కోట్లు వసూళ్లు చేసి ఇంకా వసూళ్లను కొనసాగిస్తూనే ఉంది.

ఇక మూవీ విషయంలోనే డైరెక్టర్ అట్లీపై నయనతార సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. తదుపరి టాలీవుడ్ లో ఏ సినిమాలను ఒప్పుకోకూడదని నయనతార ఫిక్స్ అయిందట. ఇందుకు కారణం జవాన్ మూవీలో తాను నటించిన సీన్స్ ని చెప్పా పెట్టకుండా కట్ చేయడమే అని తెలుస్తుంది. ఇదే క్రమంలో జవాన్ సినిమాలో దీపిక పదుకోనే క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడం సైతం నయనతార కు కోపం తెప్పించిందట.

గతంలో షారుఖ్ ఖాన్ తో దీపిక పలు సినిమాల్లో నటించగా.. వీరి జంట మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న తనకు సినిమాలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని నయనతార ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉండాలని నయనతార ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.