మెగా హీరోల దెబ్బకి భయపడిపోతున్న ఓటీటిలు..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో మెగా హీరోలు నటించిన చిత్రాలన్నీ కూడా అభిమానులను నిరాశ పరుస్తూ ఉన్నాయి. ఎక్కువగా పొలిటికల్ టచ్ లో ఉన్న సినిమాలను తెరకెక్కిస్తు ప్రేక్షకులను మెప్పించలేక ఘోరమైన డిజాస్టర్ లను మూటకట్టుకుంటున్నారు. అయితే ఈ సినిమాలు ఓటీటి లో విడుదలైన పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. వీటితోపాటు మెగా హీరోలు రీమిక్స్ సినిమాలు చేయడంతో ఈ సినిమాలను పెద్దగా పట్టించుకోవడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ తీసిన సినిమాలు రీమేక్ చేయడం గతంలో కూడా జరుగుతూ వస్తూ ఉండేది.

Bhola Shankar: ఏంటి BRO.. ఇలా అయ్యింది..? - dialtelugu

కానీ ఇప్పుడు పరిస్థితిలు ఒక్కసారిగా మారిపోయాయి ఒక సినిమా సొంత కథతో ఏదైనా భాషలో రిలీజ్ అయ్యిందంటే చాలు దానికి మిగతా అన్ని భాషలలో కూడా రీమిక్స్ చేయడం లేదు డబ్బింగ్ చేసి కేవలం సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా రీమిక్స్ సినిమాని చేయడం జరిగింది ఈ సినిమా తెలుగులో నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిన ఎవరు పట్టించుకోవడంలేదట. అందుకే ఈ ఓటిటి సంస్థలు కూడ తెలుగు చిత్రాలని తక్కువ ధరకే కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

 

ఇక పవన్ కళ్యాణ్ ,సాయి ధరంతేజ్ నటించిన బ్రో మూవీ కూడా రీమిక్స్ సినిమా గానే విడుదల చేశారు. వినోదయ సీతం సినిమా అన్ని ప్లాట్ఫారంలో కూడా విడుదలయ్యింది. కొత్తగా చూసే అవసరం లేకుండానే ఉన్నది. ఇక స్టార్ హీరోల చిత్రాలు కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇలాంటి సినిమాలను కొన్న ఓటిటి సంస్థలకు చాలా నష్టాలు వెలబడుతున్నట్లు సమాచారం. చిన్న సినిమాలుగా వచ్చి మంచి విజయాలను అందుకున్న సినిమాలను కాస్త ఎక్కువ డబ్బు ఇచ్చి కొంటే ప్రేక్షకులు నష్టాల కంటే లాభాలు వస్తాయని ఓటీటి సంస్థలు భావిస్తున్నట్లు సమాచారం.