” వార్ 2″ పై ఓ క్రేజి అప్డేట్..!

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీస్ లో వార్ 2 ఫస్ట్ స్థానంలో ఉంది. ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పై ఎప్పటినుంచో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందని న్యూస్ వైరల్ అవుతుంది. ముందుగా ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ల పై యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారట.

ఇద్దరు టాప్ స్టార్ హీరోలు పోటాపోటీగా తలపడ్డారంటే వారు ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మరి ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబో అంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుంది అనే ఆసక్తి టాలీవుడ్ ప్రేక్షకుల్లో మొదలైంది. ఇక వార్ 2 కథ విషయానికి వస్తే హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉండబోతుందట.

 

ఇది ఇద్దరు స్నేహితుల కథ అని అర్జునుడు – కృష్ణుడులా కలిసి ఉన్న ఇద్దరు స్నేహితులు చివరకు శత్రువులుగా మారితే ఏ రేంజ్ లో వార్ ఉంటుంది అనే యాంగిల్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఏది ఏమైనా వార్ 2 అనేది యాక్షన్ ఫిల్మ్‌ మరి యాక్షన్ ఫిల్మ్‌లో ఎన్టీఆర్ ఏ రేంజ్ లో తన నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.