సెలూన్‌లో షేవింగ్ చేయించుకున్న మహిళ వీడియో.. బ్ర‌హ్మంగారు అప్పుడే చెప్పారుగా..!

నీళ‌తో దీపాలను వెలిగించే శక్తి పుట్టిస్తారు. నీటి నుంచే కరెంటు వస్తుంది, పొట్టివాడు దేశాన్ని ఏల‌తాడు, పంది కడుపున కోతి పుడుతుంది, రెక్కలు వచ్చిన కోడి పిల్ల మనిషి భాషలో మాట్లాడుతుంది. ఇవన్నీ వినడానికి వింతగా ఉన్నప్పటికీ బ్రహ్మంగారు చెప్పిన సత్యాలు. ఏదో ఒక సందర్భంలో ఇవి జరిగాయి. ఇప్పుడు కూడా ఇదే తరహా వింత సంఘటన ఒకటి జరిగింది. ఇది చూసిన వారంతా ఏంటి విచిత్రం అని ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వింతలు కూడా జరుగుతాయా అంటూ నోరెళ్ళ పెడుతున్నారు.

ఇంతకీ ఆ సంఘటన ఏంటి అంతా ఆశ్చర్యాన్ని కలిగించే ఆ విషయం ఏంటో ఒకసారి చూద్దాం. సెలూన్ లో ఓ అమ్మాయి తన ముఖానికి షేవ్‌ చేయించుకుంటూ కనిపించింది.ఆ సన్నివేశాన్ని వీడియో తీసి ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో 15 సెకన్ల‌ పాటు సాగిన ఈ క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ అమ్మాయి ముఖంపై షేవింగ్ క్రీమ్ రాసి బార్బర్‌ మగవాళ్లకు షేవ్‌ చేసే బ్లెడ్ తోనే షేవింగ్ చేస్తున్నాడు.

అది చూసిన వారంతా షాక్‌ గురవుతున్నారు. ఈ వీడియోని షేర్ చేస్తూ మార్పు అనేది ప్రకృతి నియమం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెట్టిజన్స్ కొన్ని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా టిక్ టాక్ లో ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అయింది. ఓ మహిళ తన ముఖాన్ని ఎప్పటికప్పుడు షేవ్ చేసుకున్నట్లు వెల్లడించింది. అలా ముఖానికి షేవింగ్ చేసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని చ‌ర్మంపై మృత‌క‌ణాలు, నూనెలను తొలగిస్తుందని మేకప్ మరింత సాఫీగా అప్లై చేయడానికి సహాయపడుతుందని ఆమె వివరించింది.

అలాగే షేవింగ్ చేసుకోవడం చర్మానికి ఎలాంటి హాని చేయదని చెప్పుకొచ్చింది. పురుషులులా షేవింగ్ చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య కారణాలు ఉన్నాయని నమ్మడమే ఇప్పుడు ఈ మహిళ కూడా షేవింగ్ చేసుకోవడానికి కారణం. ఏది ఏమైనప్పటికి బ్రహ్మంగారు ఆడవారు సెలూన్‌లో షేవింగ్ చేసుకుంటారు అని చెప్పిన మాట నిజమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అవుతుంది.