టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్లలో రమ్యకృష్ణ గురించి చెప్పాల్సిన పనిలేదు..హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రధాన పాత్రలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తోంది. రమ్యకృష్ణ కెరియర్లో గుర్తిండిపోయే పాత్రలు ఏవైన ఉన్నాయంటే నరసింహ సినిమా బాహుబలి సినిమా పాత్రలని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ కి నటనపరంగా మంచి మార్కులు తెచ్చిపెట్టాయి. కమర్షియల్ గా కూడా మంచి విజయాన్ని అందుకున్న రమ్యకృష్ణ తాజాగా జైలర్ సినిమాలో కూడా నటించింది.ఈ సినిమాతో మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రమ్యకృష్ణ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.
నరసింహ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ అని ఆలోచించలేదట..రజినీకాంత్ తో నటిస్తున్న సినిమాలో భాగం కావాలని మాత్రమే అనుకున్నారని తెలిపింది.. కానీ ఆ చిత్రంలో సౌందర్య ముఖం పైన కాలు పెట్టే సన్నివేశం ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని చాలా భయపడ్డాను.బాహుబలి సినిమా మరో హిట్టును తెచ్చిపెట్టిందని ఆ సినిమాతో ఆ స్థాయిలో పేరు వస్తుందని అనుకోలేదని తెలిపింది. అయితే ఆ చిత్రంలో నటించడానికి కొన్ని కండిషన్లు పెట్టినట్లు తెలిపింది రమ్యకృష్ణ.
కండిషన్లలో రాత్రిపూట షూటింగ్ చేయనని చెప్పానని అలాగే షూటింగ్ కోసం కేవలం కొన్ని రోజులు మాత్రమే డేట్స్ ఇవ్వగలరని చెప్పిందట. అయితే ఈ కండిషన్స్ కి రాజమౌళి కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.. అయితే రాజమౌళి ఒప్పుకోవడానికి ముఖ్య కారణం డైరెక్టర్ కృష్ణవంశీ మీద ఉండే అభిమానం తో పాటు కృష్ణవంశీ భార్య రమ్యకృష్ణ కూడా మేడం లాగా చూడడంతో రమ్యకృష్ణ ఎన్ని కండిషన్లు పెట్టిన ఎంత గౌరవంగా రాజమౌళి వీటికీ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం శివగామి పాత్ర మంచి సక్సెస్ అవ్వడంతో తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది.