సమంత, విజయ్ మద్య వీడియో కాల్స్.. అర్ధరాత్రి ఒంటి గంటకు కూడానా…..!!

సమంత విజయ్ నటించిన ఖుషి సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. పాటలతో హైప్ పెంచేస్తున్నారు. రికార్డెడ్ ఇంటర్వ్యూలు వదులుతున్నారు. సమంత ఇండియాలో లేకపోవడం, ప్రమోషన్లకు అందుబాటులోకి రాలేకపోవడంతో ఖుషి టీం సైతం ఏం చేయలేకపోతోంది. మ‌రో ప‌క్క సమంత న్యూయార్క్‌లో సందడి చేస్తోంది.

విజయ్ ఒక్కడే ఇక్కడ ఉన్నాడు. గత వారం కోయంబత్తూరు వెళ్లి కోలీవుడ్, మాలీవుడ్ మీడియాతోనూ ముచ్చటించాడు విజ‌య్‌. పాన్ ఇండియా అన్నారు కానీ ఇంత వరకు బాలీవుడ్ మీడియాకి ముందుకు విజయ్ వెళ్లలేదు. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ప్రివ్యూ షోస్ ద్వారా పాజిటివ్ టాక్ రాగా సినిమా హిట్ అయినట్లే అంటున్నారు ప్రేక్షకులు.

ఇక మరో నాలుగు రోజుల్లో సినిమా విడుదల కానుండగా… ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. కాస్త డిఫరెంట్ గా కూడా ట్రై చేశారు. అర్ధరాత్రి ఒంటి గంటకు సమంత, విజయ్ దేవరకొండ వీడియో కాల్ మాట్లాడుతున్నట్లుగా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో నాక్, నాక్ గేమ్ ఆడిన హీరో హీరోయిన్లు సినిమా విడుదల అవుతున్నట్లుగా ప్రేక్షకులు కామెంట్ చేశారు.