అమెరికా కంటే ఇండియానే బెట‌ర్‌… ఇక్క‌డ ఉంటే ఇన్ని లాభాలున్నాయా..!

ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరి క‌ల‌ అమెరికాలో జాబ్ చేయడమే.. కుదిరితే అక్కడే స్థిరపడిపోవాలని కూడా కోరుకుంటారు. కానీ ఈ ట్రెండ్ కు భిన్నంగా ఓ వ్యక్తి తనకు ఇండియాలో ఉండటమే ఇష్టమని చెప్పాడు. అతడు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం పెద్ద చర్చకే దారి తీసింది.

2021 లో తన తండ్రి పోయారని, అప్పటి నుంచీ కుటుంబం దగ్గర ఉండడానికి అతను మొగ్గు చూపాడని చెప్పాడు. అమెరికాలో వర్క్ కల్చర్ తెలుసుకోవడానికి వెళ్లినా అంతిమంగా ఇండియాలోనే సెటిల్ అవుతానని అన్నాడు. ఇండియాలో అయితే స్నేహితులు, బంధువులు సాయం చేసేందుకు ఎప్పుడు రెడీగా ఉంటారని వివరించాడు. ఇక్కడ ప్రైవేట్ చదువులకు అమెరికాతో పోలిస్తే ఖర్చు తక్కువని, ప్రభుత్వ విద్యా కూడా బానే ఉంటుందని చెప్పుకొచ్చాడు.

తనకు దేశభక్తి అనే దానికంటే మాతృదేశంలో దొరికే సౌకర్యం మరెక్కడ ఉండదని.. ఇది కూడా ఓ రకమైన దేశభక్తి అని వివరించాడు. కుటుంబం, బంధువులు, స్నేహితుల కోసమని అమెరికా వెళ్ళె అవకాశం వచ్చిన ఇండియాలో ఉండిపోయామని అనేకమంది చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో నెట్టింట చర్చగా మారింది.