ఏకంగా 130 సినిమాల్లో కలిసి జంటగా నటించిన ఆ స్టార్ నటులు.. గిన్నిస్ రికార్డ్..

సినీ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఫేవరెట్ స్క్రీన్ కపుల్ అనగానే చాలామందికి టక్కున గుర్తొచ్చేది షారుఖ్ ఖాన్ – కాజోల్ వీరిద్దరూ కలిసి కేవలం ఆరు సినిమాల్లో మాత్రమే నటించారు. కానీ అంతకంటే ఎక్కువసార్లు హీరో హీరోయిన్లుగా ఓ జంట ఏకంగా 130 సార్లు జతకట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంతకీ ఆ ఇండియన్ యాక్టర్స్ ఎవరో తెలుసా?

మలయాళ ఇండస్ట్రీకి చెందిన ప్రేమ్ నజీర్, షీలా వీళ్ళిద్దరూ దాదాపు 130 సినిమాలకు జంటగా నటించి రికార్డ్ సెట్ చేశారు. పైగా ఈ సినిమాల్లో సగానికి పైగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్లుగా నిలిచి వసూళ్ల వర్షం కురిపించాయి. 1962 నుంచి 1981 మధ్య కాలంలో వీళ్ళు కలిసి నటించి ఏడాదికి ఇండస్ట్రీకి కనీసం ఒక్క హిట్ సినిమానైనా ఇచ్చారు.

అలా షీలా 1987లో పెళ్లి చేసుకుని సినిమా పరిశ్రమకు దూరం అయింది. దీంతో ఈ హిట్ పెయిర్ సినిమాలకు బ్రేక్ పడింది. ఇక 1989లో తన 62 ఏళ్ళ వయసులో ప్రేమ్ నజీర్ మరణించాడు. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆ సినిమాలు ఏమై ఉంటాయి అనే అంశంపై చర్చ మొదలు పెట్టారు.