40 ఏళ్లు దాటినా డోంట్ మ్యారీ బీ హ్యాపీ అంటున్న టాలీవుడ్ హీరోలు వీళే..!!

పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం కావాలి. ప్రస్తుతం కాలంలో సినీ పరిశ్రమలు ఉన్న స్టార్ హీరోలు కొంతమంది వయసు పెరుగుతున్న పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. పెళ్లి మాటను దాటి వేస్తూ సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ఈ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ 43 సంవత్సరాలు దాటిన పెళ్లి మాట ఎత్తటం లేదు.

 

సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. విశాల్ 45 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్లిని వాయిదా వేస్తున్నాడు. మొదట ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో ఉండి వివాహం చేసుకుంటామని ప్రకటించినా.. ఆ తర్వాత చిన్న చిన్న మనస్పార్ధాలు వచ్చాయి. ఆ తర్వాత 2019లో వైజాగ్ అమ్మాయి అనూషా తో ఎంగేజ్మెంట్ చేసుకున్న పెళ్లి వరకు వెళ్లలేదు. 45 సంవత్సరాలు ఉన్న సుబ్బరాజ్ కూడా పెళ్లికి దూరంగానే ఉంటున్నాడు.

పెద్దల బలవంతంతో కాకుండా నాకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటానని సుబ్బరాజు అంటున్నాడు. సుమంత్ కీర్తి రెడ్డి ని వివాహం చేసుకున్న. ఇద్దరికీ సెట్ అవ్వక విడాకులు తీసుకున్నారు. 48 సంవత్సరాలు వచ్చిన ఇంకా సుమంత్ పెళ్లి జోలికి వెళ్లడం లేదు. హీరో సిద్ధార్థ్ 2003లో మేఘన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2007లో విడాకులు తీసుకున్నారు. ఇతని వయసు 44 సంవత్సరాలు. ఇక విడాకుల అనంతరం సిద్ధార్థ మళ్లీ పెళ్లి మాట ఎత్తడం లేదు.