తెలిసి తెలిసి పెద్ద తప్పు చేస్తున్న నాగార్జున‌.. మైండ్ దొబ్బిందా ఏంటి..?

ఒక భాష‌లో హిట్ అయిన సినిమాను వేరె భాష‌ల్లో రీమేక్ చేయ‌డం అనేది ఎప్ప‌టి నుంచో జ‌రుగుతోంది. కానీ, ఈ మ‌ధ్య టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌డం లేదు. తెలుగులో రీమేక్ సినిమాల‌కు కాలం చెల్లింది అని గాడ్ ఫాద‌ర్‌, బ్రో, భోళా శంక‌ర్ వంటి చిత్రాలు నిరూపించాయి. దీంతో రీమేక్ సినిమాల జోలికి పోకూడ‌ద‌ని తెలుగు హీరోలకు ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది.

కానీ, అక్కినేని మ‌న్మ‌థుడు నాగార్జున తెలిసి తెలిసి మ‌ళ్లీ అదే త‌ప్పు చేస్తున్నాడు. నిన్న ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అప్డేట్ వ‌చ్చింది. `నా సామిరంగ‌` అంటూ నాగార్జున త‌న 99వ సినిమాను అనౌన్స్ చేశాడు. విజయ్‌ బిన్ని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మంగ‌ళ‌వారం బ‌య‌ట‌కు వ‌చ్చిన టైటిల్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ వీడియోలో నాగార్జున మాస్‌ అవతారంలో కనిపించి ఆక‌ట్టుకున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి అక్కినేని అభిమానుల గుండెల్లో పిడుగు ప‌డే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే నా సామిరంగ రీమేక్ మూవీ అట‌. 2019లో రిలీజ్ అయిన మ‌ల‌యాళ సూప‌ర్ హిట్‌ ‘పోరింజు మరియం జోస్’ అనే సినిమాకి ఇది రీమేక్ గా వస్తుందట. కేరళలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ముగ్గురు స్నేహితుల చుట్టూ ఈ కథ తిరగనుంది. అయితే ఈ సినిమానే తెలుగులో రీమేక్ చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ వ‌ర్రీ అయిపోతున్నారు. సినీ ల‌వ‌ర్స్ నాగార్జున‌కు మైండ్ దొబ్బిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.