నేను ప్రతిరోజు అది తాగాలనే ఆలోచనతోనే నిద్ర లేస్తాను.. నభా నటాషా..!

రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటాషా. మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో మంచి పాపులారిటీ దక్కించుకుంది నటాషా. తర్వాత పలు సినిమాలను నటించిన పెద్దగా హిట్ అందుకోలేకపోయింది.

కరోనా వల్ల నభా సినీ కెరీర్ కు బ్రేక్ పడిందనే చెప్పాలి. ఆ తరువాత ఓ సర్జరీ జరగడంతో సినిమాలకు దూరమైంది నాభా. ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కుర్రాళ్లకు గ్లామర్ విందు చేసే ఈ హాట్ బ్యూటీ ఇటీవల ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను తన ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది. ప్రతి ఒకరు ఉదయం ఏదో సాధించాలని ఆలోచనతో మేల్కొంటూ ఉంటారు.

అవి సాదరణ ఆలోచనలైనా కావచ్చు.. లేదా.. వారి లైఫ్ గోల్స్ అయినా కావచ్చు.. ఎప్పుడు ఒకే ఆలోచనతో లేస్తూ ఉండొచ్చు.. లేదా ఆలోచనలు మారుతూ ఉండవచ్చు.. కానీ వారు అవన్నీ ఎప్పుడైనా సాధిస్తారా అని నేను ఎప్పుడూ? ఆశ్చర్యపోతూ ఉంటాను. నేను మాత్రం కాఫీ తాగాలని ఆలోచనతో మాత్రమే నిద్ర లేస్తాను అంటూ వివరించింది. అంతేకాకుండా మేకప్ లేకుండా ఉన్న తన ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోస్ తో పాటు ఆమె రాస్కొచ్చిన లైన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Nabha Natesh (@nabhanatesh)