దర్శక దీరుడు రాజమౌళికి, సీనియర్ హీరో జగతిబాబుకి ఉన్న బంధుత్వం ఏమిటో తెలుసా..!?

తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన నేటి తరం దర్శకులలో దర్శక ధీరుడు రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టినన రాజమౌళి ఇప్పటివరకు 12 సినిమాలు కు పైగా దర్శకుడుగా వ్యవహరించి ప్రతి సినిమాకు తనలోని దర్శకత్వ ప్రతిభను పెంచుకుంటూ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమాల దృష్టికి తీసుకువెళ్లాడు.

అదేవిధంగా ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్న ఆస్కార్ బహుమతిని త్రిబుల్ ఆర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు అందించాడు. ప్రస్తుతం తన తర్వాత సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు కూడా దర్శకుడుగా నిర్మాతగా పలు సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే కార్తికేయ ఆకాశవాని అనే సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఇది ఇలా ఉండగా కార్తికేయ 2020లో వివాహం చేసుకున్నాడు.. తన స్నేహితురాలు పూజా ప్రసాద్ ను కార్తికేయ పెళ్లి చేసుకోగా వీరి వివాహానికి టాలీవుడ్‌కు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు.

 

అయితే కార్తికేయ భార్య పూజా ప్రసాద్ మరెవరో కాదు. టాలీవుడ్ సీనియర్ హీరో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ఒక వెలుగు వెలుగుతున్న జగపతిబాబు మేనకోడలు.. ఈమె కూడా చిత్ర పరిశ్రమలో స్టార్ సింగర్ గా కొనసాగుతుంది.. అదేవిధంగా కార్తికేయ తన సినిమాలతో పాటు తన తండ్రి రాజమౌళి చేస్తున్న సినిమాలకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ దగ్గరుండి తన తండ్రి సినిమాలు చూసుకుంటున్నారు. ఈ విధంగా రాజమౌళికి జగపతిబాబు అన్నవరస అవుతాడు.