నాగ‌చైత‌న్య నా క్ర‌ష్ అంటోన్న బ‌లగం బ్యూటీ…!

టాలీవుడ్ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్.. అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చాన గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ బ్యూటీ ఇటీవల బలగం సినిమాలో హీరోయిన్గా నటించి పాపులారిటీ దక్కించుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన నటనతో మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఈ ఇంటర్వ్యూలు కావ్య మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన ముద్దు పేరు అమ్ము అని, తనకు బీచ్ ప్రదేశాలంటే ఇష్టమంటు చెప్పుకొచ్చింది. అలాగే నేను నిద్ర లేచిన వెంటనే ఇన్స్టాగ్రామ్ చూస్తాను.. నాకు అన్నం ఆవకాయ అంటే చాలా ఇష్టం అంటూ వివరించింది. ఇక ఆమెకు ఇష్టమైన సెలబ్రిటీ క్రష్ నాగచైతన్య ఆట.

గౌతమీనన్, శేఖర్ కమ్ముల, మణిరత్నం తన ఫేవరెట్ దర్శకులని చెప్పుకొచ్చింది. ఇక ఆమె సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ నేను మసూదా సినిమాలో మొదటగా నటించాన‌ని అయితే ఆ సినిమాకు ముందే చాలా సినిమాల ఆడిషన్స్‌కి వెళ్లి రిజెక్ట్ అయ్యానని ఆ సమయంలో చాలా బాధపడేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.