అమెరికాలో స‌మంత ఏం చేస్తుందో చూడండి.. ఫుల్ ఖుషీ…!

హీరోయిన్ సమంత ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. నార్మల్‌గా అయితే ఎవరూ దీనిని పట్టించుకునేవారు కాదు. కానీ గత కొంతకాలంగా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఈ టూర్ చికిత్స కోసమే వెళ్లి ఉంటుందంటూ పళ్ళు రూమర్స్ వచ్చాయి. మరి ఈ జర్నీ వెనక అసలు విషయం మ‌యోసైటిస్ ట్రీట్మెంట్ కాదు మరొక కారణం ఉందని ఇప్పుడు రివిల్ అయింది. భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా న్యూయార్క్ లో ఇండియాడే ఫర్ డే వేడుకల్ని నిర్వహిస్తారు.

ఈ ఆదివారం మధ్యాహ్నం ఇవి గ్రాండ్గా జరిగాయి. ఇందులోనే హీరోయిన్ సమంత కూడా హాజరయింది. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమంతతో పాటు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, బాలీవుడ్ బ్యూటీ జాక్వర్లిన్ డేస్ వేడుకలకు హాజరయ్యారు. ఇక ఈ వేడుకల్లో సమంత మాట్లాడుతూ నేను ఇక్కడ ఉండడం చాలా గర్వంగా ఉంది. భారతదేశ సాంస్కృతిక సాంప్రదాయాలు ఎంత గొప్పవి అనేది ఇప్పుడు మరోసారి అర్థమయ్యేలా చేశారు అంటు చెప్పింది.

ఈ మూమెంట్స్ నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి.. నాకు ఇది ఒక అరుదైన గౌరవంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే నా మూవీస్ ఆదరిస్తున్న అమెరికన్ ప్రజలకు ఎంతో ధన్యవాదాలు అంటూ వివరించింది. ఇక ఇండియా డే ఫర్ డే వేడుకల్లో సమంత కంటే ముందు అల్లు అర్జున్, రానా, అభిషేక్ బచ్చన్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సమంత అమెరికాకు వెళ్లడానికి ముఖ్య కారణం ఈవెంట్లో పాల్గొనడమే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.