మాయలోడు సినిమాకి 30 ఏళ్లు.. ఈ మూవీ విశేషాలు తెలిస్తే…

ప్రముఖ నటుడు రాజేంద్రుడు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. అయితే రాజేంద్ర ప్రసాద్ కి బాగా అచ్చొచ్చిన దర్శకుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి రెండు సినిమాలుసూపర్ హిట్ గా నిలిచాయి. అవే ‘రాజేంద్రుడు – గజేంద్రుడు’, ‘మాయలోడు’. కేవలం ఆరు నెలల వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలకీ దాదాపుగా ఒకే టీమ్ పనిచేయడం విశేషం. ఈ రెండు సినిమాల్లో  సౌందర్య హీరోయిన్ గా నటించగా,  మనీషా ఫిల్మ్స్ పతాకంపై కె.

అచ్చిరెడ్డి నిర్మించారు.  అదేవిధంగా కోట శ్రీనివాస రావు, బాబూ మోహన్, బ్రహ్మానందం, అలీ, గుండు హనుమంతరావు, శ్రీలక్ష్మి వంటి ప్రముఖ నటులు ఈ రెండు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇక రాజేంద్ర ప్రసాద్, ఎస్వీ కృష్ణారెడ్డి కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా అయిన ‘మాయలోడు’ ఆగస్టు 19తో 30 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. ఈ సందర్బంగా ఆ సినిమాకి సంబందించిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ‘రాజేంద్రుడు – గజేంద్రుడు’ సినిమా ఏనుగు సెంటిమెంట్ తో తెరకెక్కితే,  ‘మాయలోడు’ సినిమా చైల్డ్ సెంటిమెంట్ తో తెరకెక్కింది.

ఈ సినిమాలో కమెడియన్ బాబూ మోహన్, సౌందర్యపై చిత్రీకరించిన “చినుకు చినుకు అందెలతో” అనే వాన పాట అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది.  ఈ పాటకి వచ్చిన రెస్పాన్స్ చూసి ఎస్వి కృష్ణారెడ్డి తన దర్శకత్వంలోనే వచ్చిన ‘శుభలగ్నం’ సినిమా లో అలీ, సౌందర్య లపై ఈ పాటను రీమిక్స్ చేశారు . రెండు సినిమాల్లోనూ ఈ సాంగ్ ఓ ఎస్సెట్ గా నిలిచింది.  ఇలా రెండు విభాగాల్లో ‘మాయలోడు’ సినిమా నంది పురస్కారాలు అందుకుంది. ఆరు పాటల ట్రెండ్ నడుస్తున్న ఆ సమయంలో ‘రాజేంద్రుడు – గజేంద్రుడు’ తరహాలోనే ‘మాయలోడు’లోనూ ఐదు పాటలతో సరిపెట్టారు ఎస్వీ కృష్ణారెడ్డి . ఈ రెండు సినిమా లోని పాటలు మ్యూజిక్ లవర్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.