మహేష్ చిన్నతనంలోనే హీరోగా చేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్షన్లు రాబట్టిందో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబుకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగాచెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ చిన్నతనంలోని ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి బాల నటుడుగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా బాల్యంలోని ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన‌ మహేష్. ఆ తర్వాత టాలీవుడ్‌కు రాజకుమారుడు అనే సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.

ఈ సినిమా ఆ రోజుల్లోనే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద వద్ద కలక్షన్‌ల వర్షం కురిపించింది. ఈ సినిమాకు ముందే మహేష్ బాబు తన చిన్నతనంలో హీరోగా ఓ సినిమా చేశాడు. ఆ సినిమా పేరు ”బాల చంద్రుడు” ఈ సినిమాకి సూపర్ స్టార్ కృష్ణ స్వయంగా దర్శకత్వం వహించాడు. ఆ రోజుల్లోనే ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. ఆ సమయానికి మహేష్ బాల‌నటుడుగా ఎన్నో సినిమాలు నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఆ విధంగా వ‌చ్చిన క్రేజ్‌తో ఈ సినిమాని చూడడానికి జనాలు ఎగబడ్డారు. ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కలక్షన్లు కూడా కుమ్మేసాయి. ఆ రోజుల్లోనే ఈ సినిమా దాదాపు నాలుగు కోట్లకు పైగా కలక్షన్లను రాబెట్టిందట. ఈ సినిమాలో మహేష్ బాబు చేసిన డాన్స్, ఫైట్స్ చిన్నతనంలో ఈ రేంజ్ లో ఎలా చేశాడు అంటూ అందరూ ఆశ్చర్యపోక తప్పలేదు. ఈ విధంగా మహేష్ తన చిన్నతనంలోనే భారీ కలెక్షన్లను రాబెట్టిన సినిమాగా బాలచంద్రుడు రికార్డులకు ఎక్కింది.