జామ పండు కంటే ఆకుతో ఇన్ని లాభాలా… క‌ర‌క‌రా న‌మిలేస్తారు..!

క్సికో మరియు అమెరికా దేశాలలోని వివిధ ప్రాంతాలలో పుట్టిన జామ పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మనలో చాలామందికి జామ పండులో ఉండే పోషకాలు గురించి తెలుసు. కానీ జామ ఆకులో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు. జామ ఆకులో ఉండే లక్షణాలు కారణంగా అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. జామాకులు ఏ ప్ర‌యోజ‌నాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

క్యాన్సర్:
జామ ఆకు రసంగా చేసుకుని తాగితే క్యాన్సర్ ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుంది. జామ ఆకులు విటమిన్ సి, లైకోపిన్, కాలీ ఫినాల్స్ వంటి సహజరసాయన సమ్మేళనాలు ఉండటం వలన క్యాన్సర్ ను తగ్గిస్తుంది.

డెంగ్యూ చికిత్స:
జామ ఆకు రసాన్ని జ్వరం నివారణకు బాగా పనిచేస్తుంది. జామ ఆకులు ఉడకపెట్టిన తర్వాత వచ్చిన రసాన్ని రోజుకు మూడుసార్లు తాగితే డెంగ్యూ జ్వ‌రం తగ్గుతుంది.

బరువు తగ్గడానికి:
జామ ఆకు శరీరంలో అనవసరమైన కొవ్వును తొలగించడానికి బాగా సహాయపడుతుంది. జామ ఆకులు పిండి పదార్థాలు చక్కరలుగా మారకుండా నివారించడం ద్వారా బరువు తగ్గుతారు.

డయాబెటిస్:
జపాన్ లోని “యకుల్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్” వారు జామ ఆకు టీ మీద పరిశోధన జరిగింది. మధుమేహ వ్యాధి గ్రస్తులు నాలుగు నెలల పాటు జామ ఆకు తిని తాగితే షుగర్ తగ్గిపోతుంది.

జుట్టు రాల‌టం:
ఎవరికైనా తల మీద ఒతైన జుట్టు ఉంటేనే అందం. అలాగే జుట్టును ఇష్టపడని వారు ఉండరు. జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలకు జామాకు సహాయపడుతుంది. జామ ఆకుల్ని తీసుకుని దాంట్లో కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకుని అది నుజ్జుగా అయిపోయిన తర్వాత తల మీద పోసుకుని మసాజ్ చేయాలి. దీనివల్ల బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది జుట్టుకి సరైన పోషకాలు అంది జుట్టు ఒత్తుగా మారుతుంది.

అలెర్జీలు:
జామ ఆకు తొందరగా అలెర్జీ ని తగ్గిస్తుంది. జామ ఆకులలో ఉండే హిష్టమిన్ అనే మిశ్రమం అలెర్జీని వెంటనే నిరోధిస్తుంది.