సాధారణంగా ఎన్నికల సమయంలో బాగా సున్నితమైన ప్రాంతాల్లో గొడవలు జరగడం సహజం..కానీ ఈ సారి ఎన్నికల్లో ఏపీలో అన్నీ ప్రాంతాల్లో రచ్చ జరిగేలా ఉంది. ఇప్పుడు జరుగుతున్న గొడవలని బట్టి చూస్తే అదే నిజమనిస్తుంది. అంతకముందు ఈ స్థాయిలో గొడవలు జరగడం తక్కువగానే చూసి ఉంటాం..ఎన్నికలు లేని సమయంలో పెద్దగా గొడవలు జరగలేదు.
కానీ ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా రచ్చ మాత్రం పీక్స్ లో జరుగుతుంది. దీంతో ఎన్నికల సమయంలో ఇంకెంత రచ్చ జరుగుతుందా? అనే డౌట్ వస్తుంది. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అంతకముందు కర్నూలు, కడప, అనంతపురంలో పర్యటించిన ఈ రచ్చ లేదు. కానీ బాబుకు సొంత జిల్లాలోనే ఎదురుదెబ్బ తగిలింది. బాబు పర్యటనలని ఎక్కడకక్కడ వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నాలు చేశాయి. మొదట తంబళ్ళపల్లె రోడ్ షోలో, తర్వాత పుంగనూరు రోడ్ షోలు వైసీపీ శ్రేణులు బాబు పర్యటనలని అడ్డుకున్నాయి.
ఈ రెండు సీట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ సీట్లు. అయితే మొదట నుంచి బాబు షెడ్యూల్ ఖరారైంది. ఈ సమయంలోనే పుంగనూరులో వైసీపీ శ్రేణులు…బాబు పర్యటనకు బ్రేకులు వేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో టిడిపి, వైసీపీ శ్రేణుల మధ్య గొడవ తారస్థాయిలో జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్ళ వర్షం కురిపించుకున్నారు.
ఇటు మరో చోట పోలీసులు, టిడిపి శ్రేణులపై లాఠీ చార్జ్ చేశారు. దీంతో టిడిపి శ్రేణులు రెచ్చిపోయి..పోలీసులపై రాళ్ళు రువ్వారు. ఇలా ఎక్కడకక్కడ రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఎన్నికల రాకముందే పరిస్తితి ఇలా ఉంది. ఇక ఎన్నికల ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు జరుగుతాయో ఊహాకే అందడం లేదు. బీహార్, మధ్యప్రదేశ్, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లోనే ఒకప్పుడు గొడవలు తారస్థాయిలో ఉండేవి. ఇప్పుడు వాటి సరసన ఏపీ కూడా చేరేలా ఉంది.