రంభ ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి కారణం ఆ స్టార్ హీరో నేనా..?

డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు అని సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రంభ. ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈమె కెరియర్ సక్సెస్ బాటపడింది.రాజేంద్రప్రసాద్ నటన ఈ ముద్దుగుమ్మ అందం ఈ సినిమాకి ప్లస్ అయిందని చెప్పవచ్చు. అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ అందుకున్నది. తెలుగు, తమిళ్ ,హిందీ,మలయాళం వంటి భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది రంభ.

Tala Apna Tejoriya Ke Khol [Hot Item Dance Video] Feat.Rambha & Ravi Kishan  - YouTube

తెలుగమ్మాయి అయినప్పటికీ ఈ రేంజ్ లో వెళ్ళిన మొట్టమొదటి అమ్మాయి కూడా రంభనే అని చెప్పవచ్చు. రంభ ఎదుగుదల చూసి చాలామంది హీరోయిన్స్ కుళ్ళుకునేవారట. ఈ విషయాన్ని స్వయంగానే ఈమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేసినట్టు సమాచారం. అప్పట్లో రంభకి ఎక్కువగా బాలీవుడ్లో అవకాశాలు వస్తూ ఉండేవి ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ,సల్మాన్ ఖాన్ తదితర హీరోలతో నటించే అవకాశాలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. నటుడు రవి కిషన్ తో కలిసి భోజ్ పూరి లో అప్పట్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించింది.

అలాంటి సక్సెస్ లు స్టార్ హీరోలు నటించే అవకాశం రావడంతో అప్పట్లోనే కొంతమంది హీరోయిన్స్ రంభ ఎదుగుదలను చూసి రవికిషన్ తో అఫైర్ ఉన్నట్లు పుకార్లను పుట్టించారట.. అంతేకాకుండా తాను లవ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల రంభ సూసైడ్ అటెంప్ట్ చేసిందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇదే విషయాన్ని రంభ నీ అడగగా ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి రేపింది.. ఇది కేవలం వట్టి రూమర్స్ ఈ రూమర్లు పుట్టించింది ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్స్ చేసిన పని వాళ్లు నా జీవితంలో ఎప్పుడు కలిసింది కూడా లేదు నేనంటే వాళ్లకు పగ అని తెలియజేసింది. రవి కిషన్ తనకు పెద్ద అన్నయ్యతో సమానమని అలాంటి వ్యక్తితో ఇలాంటి లింకులు పెట్టడం చాలా బాధని తెలిపింది.