న‌య‌న‌తారకు అంత సీన్ లేద‌న్న‌ సీనియ‌ర్ న‌టి క‌స్తూరి..

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది నయనతార. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోయే హీరోయిన్లలో నయనతార ఒకటి. కెరీర్ పరంగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్న నయనతారపై ఎప్పటికప్పుడు గాసిప్స్‌, ఎఫైర్ వార్తలు వివాదాలు వైరల్ అవుతూనే ఉంటాయి. లవ్ బ్రేక‌ప్‌ లాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న నయనతార తన కెరీర్ పైనే శ్రద్ధ చూపించింది. వరుస సినిమాలో నటిస్తూ గుర్తింపుతెచ్చుకుంది. 2013 తర్వాత వరుస హిట్ సినిమాలతో తన కెరీర్ గ్రాఫ్ ను పెంచుకుంది.

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటుతున్న ఇప్పటికీ హీరయిన్ గా కొనసాగుతుంది అంటే నయనతారకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా నటి కస్తూరి మాట్లాడుతూ నయనతార గురించి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా నయనతారను అంగీకరించలేని కస్తూరి వ్యాఖ్యానించింది. కోలివుడ్‌లో స్టార్ హీరో విజయ్, కమలహాసన్, అజిత్‌ లాంటి ఎంతోమంది పెద్ద హీరోలు ఉన్నా రజినీకాంత్‌ను మాత్రమే సూపర్ స్టార్ అని అంటారు.

ఇక‌ న‌య‌న‌తారకు అంత సీన్ లేద‌న్న‌ సీనియ‌ర్ న‌టి క‌స్తూరి మరి లేడీ సూపర్ స్టార్ ఎవరు అని అడిగగా అలనాటి నటిమణులు కేపీ సుందరి, విజయశాంతి పేర్లను చెప్పింది. కస్తూరి ఇక గతంలో కూడా నయనతారపై కొన్ని వ్యాఖ్యలు చేసింది కస్తూరి. సరోగ‌సి విధానంతో నయనతార పిల్లలను క‌న్న విషయంపై ఆమె స్పందిస్తూ.. జనవరి 22 నుంచి భారత దేశంలో సర్వోగిసిని నిషేధించారు. వైద్యం పరంగా ఇది క్షమించరాని నేరమని కస్తూరి ట్విట్‌ చేసింది. ఇతరుల పర్సనల్ విషయంలో ఇన్‌వాల్వ్ అవ‌డం కరెక్ట్ కాదంటూ ఆమెపై నయనతార ఫ్యాన్స్ తో పాటు పలువురు నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ కస్తూరి నయనతార పై కామెంట్ చేయడంతో ప్రస్తుతం ఆ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.