ఈసారైనా ఆ హాట్‌ యాంకర్ బిగ్ బాస్ షోలోకి వెళ్తుందా..!

బిగ్ బాస్ సీజన్ 7 మొదలవుతుంది. ఈ సీజన్లో ఎవరెవరు ఉంటున్నారు అనే లిస్ట్ దాదాపు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అయితే గత మూడు సీజన్లుగా ఒక తెలుగు యాంకర్ పేరు బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్టులో చేరుస్తున్న హౌస్ మెట్స్‌ పరిచయం చేసేటప్పుడు మాత్రం ఈ అమ్మడు మిస్ అవుతుంది. దాదాపు బిగ్ బాస్ 3 నుంచి కూడా ఇదే జరుగుతుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ లిస్టులో ఆమె పేరు చేర్చడం ఆమె ఈసారి కంపల్సరిగా వస్తుందని చెప్పడం తీరా షో మొదలైనప్పటికీ ఆమె మిస్ అవ్వడం తెలిసిందే.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ 7 కంటిస్టెంట్స్‌ లిస్టులో కూడా ఈమె పేరు వినిపిస్తుంది. ఈసారి సీజన్లో 18 నుంచి 20 మంది హౌస్ మెట్స్ ఉంటారని తెలుస్తుండగా అందులో యాంకర్ వర్షిణి కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె ఇప్పుడు కాదు సీజన్ 3 నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతుందని హడావిడి చేసేవారు. కానీ షో మొదలయ్యేదప్పటికి ఏమీ ఉండేది కాదు. ఈసారి అయినా వర్షిణి వస్తుందా డి టీం లీడ్ గా చేసి అలరించిన వర్షిణి ఆ తరువాత స్టార్ మా లో అదిరింది షో యాంకరింగ్ చేసింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ కనిపించలేదు.

ఈ మధ్యకాలంలో పెద్దగా బుల్లితెరపై కూడా కనిపించని వర్షిని కెరీర్ ని ఎందుకంత లైట్ గా తీసుకుందొ తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ లో వస్తుందంటూ మూడు సీజన్లుగా తనపై మీడియా కవరేజ్ చేస్తున్న ఆమె గ్రాఫ్ ని పెంచే ప్రయత్నం చేసిన బయట పెద్దగా షోస్ ఏమి చేయకపోవడంతో వర్షిణి గురించి ఆలోచించడం మానేశారు ఆడియన్స్. ఫోటోషూట్స్ తో చేస్తూ కాలం గడిపేస్తున్న వర్షిణి మరి అసలు బిగ్ బాస్ కు వెళ్తుందో లేదో ఆమె బిగ్ బాస్ కి వెళ్లకుండా అడ్డుపడేది ఎవరు అనేది తెలియాల్సి ఉంది.