తల్లిగా మారినా కాజ‌ల్‌కి తప్పని క్యాస్టింగ్ కౌచ్ కష్టాలు.. న్యూస్ వైర‌ల్‌..!

సినిమా ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఎంతో కష్టం… అది కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోయిన్స్ అయితే మరీ కష్టం. అలా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ చేతిలో చిక్కి ఎంతోమంది బలయ్యారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్లు ఆఫర్ ఇవ్వాలంటే కచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాలి అనే హీరోయిన్స్‌ని బలవంతం చేయడం తెలిసిందే. స్టార్ హీరోయిన్లు కూడా దీనికి మినహాయింపు కాదు అనే విష‌మం తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఇన్సిడెంట్ ద్వారా బ‌య‌ట‌ప‌డింది. ఆఖరికి బిడ్డ తల్లిని కూడా వదలరా అని అభిమానులు క్యాస్టింగ్ కౌచ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీలో ఆఫర్స్ కావాలంటే కాసేపు ఓపిక పడితే అయిపోతుంది. ఈ దుస్థితి కేవలం యంగ్ హీరోయిన్స్‌కే కాదు సీనియర్ హీరోయిన్స్‌కి కూడా ఉండేద‌ట‌. ఇలాంటి పోరంబోకు వెదవలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. స్టార్ హీరోయిన్గా అంచెలంచెలుగా ఎదిగిన కాజల్ అగర్వాల్ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ కు బలయిందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి కాజల్ అభిమానులు ఆ డైరెక్టర్ పై మండిపడుతున్నారు.

ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కాజల్ ను అప్రోచ్ అయినా ఓ స్టార్ డైరెక్టర్… నీకు ఆ సినిమాలో ఛాన్స్ కావాలంటే తప్పనిసరిగా నేను అడిగిన దానికి ఒప్పుకోవాలంటూ టార్చర్ పెట్టాడట. నువ్వు వద్దు నీ సినిమా వద్దు అని చెప్పి మొహం మీద ఛీకొట్టి వెళ్ళిపోయిందట కాజ‌ల్‌. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆఖరికి పిల్లల తల్లిని కూడా వదలరా కడుపుకి అన్నం తింటున్నారా ఇంకా ఏదైనా తింటున్నారా అని మండిపడుతున్న నీటిజన్స్.