ఏంటో ఈ మధ్య ఎటు చూసినా రీమిక్స్ సినిమాలే కనిపిస్తున్నాయి. ఏ ఇండస్ట్రీలో చూసిన ఇలానే చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ పాపులారిటీ ఫ్యామిలీ అయినా మెగా ఫ్యామిలీ ఈ రీమిక్స్ లను ఎక్కువగా చేసింది. అయితే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలను ఈ మెగా బ్రదర్స్ తెలుగులో రీమిక్స్ చేశారు. అజిత్ తమిళంలో నటించిన వీరం అనే సినిమాను పవన్ కళ్యాణ్ కాటమరాయుడుగా రీమేక్ చేశాడు. ఈ సినిమానే తమిళంలో పరవాలేదు అనిపించుకున్న.. ఆ సినిమాను తెచ్చి ఇక్కడ రీమిక్స్ చ చేసి బిగ్గెస్ట్ డిజార్డర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు పవన్ కళ్యాణ్.
ఇక పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి కూడా 2015లో వచ్చిన అజిత్ సినిమా వేదాళం ఈ సినిమా దాదాపు 8 ఏళ్ల క్రిందటే వచ్చింది. అయినా దీన్ని తెలుగులో భోళా శంకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. కానీ మెగా అభిమానులు ఊరికే ఉంటారా మొహమాటం లేకుండా ఇ సినిమాను కూడా తిరస్కరించారు. సినిమా కథ నచ్చిందని చిరంజీవి చేయడంతో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అప్పటి జనరేషన్ తగ్గట్టుగా ఈ సినిమా బాగా సక్సెస్ అయ్యింది.
ఇప్పటి జనరేషన్ కి ఇలాంటి సినిమాలు అస్సలు నచ్చడం లేదు.. పదేళ్లకు పైగా డైరెక్షన్ కి దూరంగా ఉన్న మొహర్ రమేష్ ఏదో చేస్తాడు అనుకుంటే కథ స్క్రీన్ పైన కూడా కనీసం సరిగ్గా దిద్దలేకపోయాడు. చిరంజీవి పైనే దృష్టి పెట్టి మిగతాదంతా గాలికొదిలేసాడు. ఇలా అజిత్ సినిమాలని రీమిక్స్ చేసి మెగా బ్రదర్స్ మునిగిపోయారు. మరి ఇక మీదట రీమిక్స్ సినిమాలను చేయకుండా ఉంటారేమో చూడాలి మరి.