” సలార్ ” రన్ టైం వచ్చేసింది.. వామ్మో అన్ని గంటల..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా రూపొందుతున్న యాక్షన్ ధ్రిల్లర్ స‌లార్ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ప్ర‌స్తుతం ఫ్యాన్స్ మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా రైన్ టైం ఎన్ని గంటలు అంటే కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. స‌లార్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

పార్ట్ 1 ఏకంగా 3 గంటల రన్ టైం తో కొనసాగుతుందట. దీంతో 5 నుంచి 10 నిమిషాల పాటు కట్ చేసి పార్ట్ 1 ఫైనల్ రన్ టైమ్ ని లాక్ చేస్తారని తెలుస్తుంది. ఇందులో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు? కానీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. రవి బసృత్‌ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు హంబ‌ళే ఫిల్మ్‌ వారు నిర్మాణ బాధ్యతలు వహించారు.