ఎట్టకేలకు బాలయ్యను భారీ రేటుకు దక్కించుకున్న దిల్ రాజు..!

ఈ ఏడాది రాబోయే అక్టోబర్‌లో వ‌రుస భారీ సినిమాలు ధియెట‌ర్స్‌లో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాయి. నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి, విజయ్ ద‌ళ‌వ‌తి లియో, రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఈ 3 సినిమాలు అక్టోబర్‌లో రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరి మరియు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన లియో రెండు అక్టోబర్ 19 , 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇక ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్‌ దిల్ రాజు నైజం పాత్రలో లియో మరియు భగవంత్‌ కేసరి రెండింటి తెలుగు పంపిణీ రైట్స్ ను భారీ పెట్టుబడులతో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు. ఇక‌ దిల్ రాజు నిజంగానే బాలయ్య భగవంత్‌న్ కేసరి సినిమా రైట్స్ ను కూడా సొంతం చేసేసుకున్నాడా అనే అంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

 

బాలయ్య నటిస్తున్న భగవత్ కేసరి సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమాతో విజయ్ దళపతి లియో పోటీ పడుతుంది. విజయ్ దళపతికి కూడా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇక‌ ఈ రెండిట్లో ఏ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.