తండ్రి వ‌య‌సున్న హీరోతో ర‌ష్మిక రొమాన్స్‌.. మైండ్ దొబ్బిందా అంటూ ఏకేస్తున్న ఫ్యాన్స్‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ ఈ బ్యూటీ సినిమాలు చేస్తోంది. తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప 2` మూవీ చేస్తోంది. అలాగే హిందీలో ర‌ణ‌బీర్ క‌పూర్ తో `యానిమ‌ల్‌` సినిమాలో న‌టిస్తోంది. వీటితో పాటు రీసెంట్ గా ర‌ష్మిక ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ కు క‌మిట్ అయింది.

అదే `రెయిన్ బో`. ఇందులో శాకుంత‌లం ఫేమ్ దేవ్ మోహ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ మూడు ప్రాజెక్ట్ లు ఇప్పుడు సెట్స్ మీదే ఉన్నాయి. ఇంత‌లోనే ర‌ష్మిక మ‌రో ప్రాజెక్ట్ కు క‌మిట్ అయింది. కోలీవుడ్ లో తండ్రి వ‌య‌సున్న హీరోతో ర‌ష్మిక రొమాన్స్ కి రెడీ అవుతోందని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు చియాన్ విక్ర‌మ్. ప్ర‌స్తుతం ఈయ‌న `తంగలాన్‌` మూవీతో బిజీగా ఉన్నాడు. తంగ‌లాన్ అనంత‌రం `2018`తో సంచలనం సృష్టించిన మ‌ల‌యాళ‌ దర్శకుడు జూడ్ ఆంథోని జోసెఫ్ తో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.

వీరి కాంబో ప్రాజెక్ట్ ను లైకా ప్రొడెక్ష‌న్స్ వారు నిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ర‌ష్మిక న‌టించ‌బోతోంద‌ట‌. విక్ర‌మ్ కు జోడీగా ఆమెను ఎంపిక చేశార‌ని.. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని జోరుగా టాక్ న‌డుస్తోంది. అయితే ర‌ష్మిక ఈ ప్రాజెక్ట్ కు సైన్ చేయ‌డం ఆమె ఫ్యాన్స్ లో కొంత మందికి అస్స‌లు న‌చ్చ‌లేదు. ఎందుకంటే, విక్ర‌మ్‌-ర‌ష్మిక మ‌ధ్య ఏకంగా 30 ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉంది. దీంతో తండ్రి వ‌య‌సున్న హీరోతో సినిమాకు ఒప్పుకున్నావా.. మైండ్ గానీ దొబ్బిందా.. అంటూ ఫ్యాన్స్ ఏకేస్తున్నారు. సీనియ‌ర్ హీరోల‌కు ఒక్క‌సారి క‌మిట్ అయితే.. ఇక నిన్ను యంగ్ స్టార్స్ ప‌ట్టించుకోర‌ని ర‌ష్మిక‌ను హెచ్చ‌రిస్తున్నారు.