రకుల్ పరిస్థితి ఏంటి అలా అయింది.. అటు బాలీవుడ్ పోయింది ఇటు సౌత్ పోయింది!

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తన నటన అందంతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గ ఎదిగింది. ఇలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ ప్రీత్ ఉన్నటుంది సౌత్ సినిమాలకు దూరం అయింది. బాలీవుడ్ పై కన్నేసిన రకుల్ నార్త్ వైపు అడుగులు వేసి అక్కడ కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాంతో ప్రస్తుతం రకుల్ కెరీర్ చాలా స్లో అయింది.

ఈ అమ్మడు సోషల్ మీడియా లో హడావిడి చేస్తున్నప్పటికి సిల్వర్ స్క్రీన్ పై మాత్రం కనిపించడం లేదు. ఒకప్పుడు సౌత్ స్టార్ హీరోలందరి సరసన మెరిసిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో మాత్రం ఆ రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. అయితే బాలీవుడ్ లో అజయ్ దేవ్ గన్ అండతో అడపా దడపా అవకాశాలు దక్కించుకున్నా కూడా స్టార్ హీరోయిన్ గ మాత్రం ఎదగలేకపోయింది. ఈ మధ్య నార్త్ లో రకుల్ నటించిన సినిమాలు అన్ని ఓటిటి బాట పడుతున్నాయి. దాంతో రకుల్ సినీ కెరీర్ ఎండింగ్ కి వచ్చిందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇకనైనా రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ సినిమాలో ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ రకుల్ ఆమధ్య సౌత్ సినిమాలు చెయ్యకపోవడానికి గల కారణాలను చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఆమెకి ఇంట్రెస్టింగ్ సినిమాలు రావడం లేదని, అందుకే తెలుగు సినిమాలు చెయ్యడం లేదని చెప్పుకొచ్చింది రకుల్. దాంతో నిజంగానే ఆమెకి నచ్చిన సినిమా లు రావడం లేదా? లేదంటే ఎక్కడివాళ్ళు ఆమెని పట్టించుకోడం మానేసారా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక సోషల్ మీడియా లో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంది.