హైపర్ ఆది చేసిన కామెంట్స్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన వర్మ..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఈనెల 11వ తేదీన థియేటర్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను శిల్పకళా వేదికగా చాలా గ్రాండ్గా నిర్వహించడం జరిగింది. అయితే ఈవెంట్లో పాల్గొన్న హైపర్ ఆది పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటుందో లేదో చెప్పలేము కానీ ప్రతి ఇంటికొక మెగాస్టార్ అభిమాని ఉంటాడు ఆస్తులు సంపాదించడం కంటే అభిమానులను సంపాదించుకోవడమే మిన్న అనే దారిలోనే చిరంజీవి నడుస్తారని కానీ అలాంటి వ్యక్తిని అవమానించి మాట్లాడుతున్నారు అంటూ తెలియజేశారు. ముఖ్యంగా మన టాలీవుడ్ లోనే ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయనను అనే స్థాయి నాకు లేదు అలాగని మెగాస్టార్ పవన్ కళ్యాణ్ అనే స్థాయి ఆయనకు లేదు అని తెలిపారు చిన్న పెగ్గు వేసినప్పుడు మెగాస్టార్ ను.. పెద్ద పెగ్గు వేసినప్పుడు పవర్ స్టార్ ను పలు రకాలుగా ఆయన విమర్శిస్తూ ఉంటారని తెలిపారు.

ఇన్ డైరెక్ట్ గా రాంగోపాల్ వర్మ కు కౌంటర్ ఇవ్వడంతో.. దీనిపైన వెంటనే స్పందించిన రాంగోపాల్ వర్మ హైపర్ ఆది మాటలకు గట్టి కౌంటర్ ఇస్తూ ఒక ట్విట్ చేయడం జరిగింది..ఒక అమ్మాయి కాళ్ళను ముద్దు పెడుతూ భోళా శంకర్ సినిమా ఈ అమ్మాయి కాలి గోటికి కూడా నయం కాదు అంటూ తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు ప్రస్తుతం రాంగోపాల్ వర్మ షేర్ చేసిన ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా హైపర్ ఆదికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారని పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.