ప్ర‌భాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌లో పిలిచి ఛాన్స్ ఇస్తామంటే చేయ‌న‌న్న త‌మ‌న్నా.. త‌ర్వాత ఇంత ఏడ్చేసిందా…!

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటుతున్నా ఇప్ప‌టికి అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. ఇటీవల బాలీవుడ్ వెబ్ సిరీస్‌లతో మంచి క్రేజ్ సంపాదించుకున్న తమన్న తాజాగా రజనీకాంత్ ‘ జైలర్ ‘ సినిమాలో హీరోయిన్గా నటించి పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ దక్కించుకుంది. తెలుగులో ‘ భోళాశంకర్ ‘ ఫ్లాప్ అయినా అమ్మడికి మాత్రం జైలర్ కొద్దిగా ఊరటను ఇచ్చిందని చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలో తమన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

అందులో త‌మ‌న్నా మాట్లాడుతూ రజనీకాంత్ తో కలిసి నటించడం నాకు ఎప్పటినుంచో ఒక క‌ల‌ అని ఆయనతో కలిసి ఎలాగైనా ఓ ఫోటో దిగాలి అనుకునేదాన్ని కానీ జైలర్‌లో ఆయనతో కలిసి నటించడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది. చిన్నప్పటినుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను ఇప్పుడు ఆయనతో కలిసి నటించడానికి నాకు ఛాన్స్ ఇచ్చిన నెల్సన్ దిలీప్ కుమ‌ర్‌కు చాలా ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చింది.

ఇక తమన్నా తన కెరీర్ లో కొన్ని సినిమాలు వదులుకున్నందుకు ఇప్పటికీ ఎంతగానో బాధపడుతున్నానని వివరించింది. నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పటికీ బాధపడేలా చేస్తున్నాయని మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసినప్పుడల్లా నేను బాధపడుతూనే ఉంటానని వివ‌రించింది. ఆ సినిమా నాకు ఎంతగానో నచ్చింది మొదట ఆ కథ నా దగ్గరికి వచ్చింది కానీ నేను అప్పట్లో వేరే సినిమా షూటింగ్లలో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమాను రిజెక్ట్ చేశానని.. కానీ ఈ సినిమా చూశాక ఏదో విధంగా టైం ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించిందని చెప్పుకొచ్చింది.

ఈ సినిమా మిస్ అయినందుకు నేను ఇప్పటికీ ఎంతో బాధపడుతున్నానని వివరించిన తమన్నా ఈ సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది కాజల్ రోల్ లోనా..? లేదా తాప్సి పాత్రలోనా..? వివరించలేదు. ఏది ఏమైనా తమన్నా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాను మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ ఎంతగానో బాధపడుతుందన న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.