టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . బాహుబలి సినిమా తర్వాత ఆయన స్థాయి ఏ రేంజ్ లో మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలోనే ఒక్కో సినిమాకి 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డులు నెలకొల్పిన ప్రభాస్ ప్రెసెంట్ పలు సినిమాలో నటిస్తున్నాడు . ప్రభాస్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వస్తే ఎంత ఆనందపడతారో ఆయన పెళ్లి చేసుకుంటే అంతకు ట్రిపుల్ స్థాయిలో ఫ్యాన్స్ ఆనందపడతారు అన్న విషయం అందరికీ తెలిసిందే .
అయితే ప్రభాస్ ఏమో ఇదిగో పెళ్లి అదిగో పెళ్లి ..రేపు చేసుకుంటాను ..ఎల్లుండి చేసుకుంటాను అంటూ తప్పించుకుని తిరుగుతున్నారు . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉండే అనుష్కతో ఆయన ప్రేమాయణం నడుపుతున్నాడు అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎప్పటికప్పుడు వాళ్లు కాదు మేము ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొస్తున్న అభిమానులు మాత్రం నమ్మడం లేదు. రీసెంట్ గానే కృష్ణంరాజు పర్సనల్ డైరీ బయటపడడంతో మరోసారి అనుష్క – ప్రభాస్ లో పెళ్లి మేటర్ వైరల్ గా మారింది.
కాగా తన పర్సనల్ విషయాలను డైరిలో రాసుకునే కృష్ణం రాజు అనుష్క ప్రభాస్ ల పెళ్లి గురించి కూడా ఆ డైరీలో రాసుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .”ప్రభాస్ తనకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంట్లో పిల్లాపాపలతో తిరుగుతూ ఉంటే చూడాలని ఉంది. ప్రభాస్ పిల్లలను నేను ఎత్తుకొని ఆడించాలని ఉంది. ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా “అంటూ రాసుకోచ్చాడట . అంటే ప్రభాస్ అనుష్కల పెళ్లి కృష్ణంరాజుకు ఇష్టమే.. కానీ ప్రభాస్ అనుష్కలే ఎందుకో పెళ్లి వరకు వెళ్లలేకపోతున్నారు అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు .అంతేకాదు గతంలోనూ ఓ స్టార్ హీరో కారణంగానే ప్రభాస్ అనుష్క దూరంగా ఉంటున్నారు అన్న ప్రచారం జరిగింది. రీసెంట్గా కృష్ణంరాజు డైరీ బయటపడడంతో ఆ విషయం కన్ఫామ్ అయిపోయింది. చూడాలి మరి ఈ జంట పెళ్లి చేసుకుంటున్నాం అన్న గుడ్ న్యూస్ ని ఎప్పుడు చెప్తారో..?