నరేష్ కి శుభవార్త చెప్పిన పవిత్ర లోకేష్.. ఫ్యాన్స్ ఎగిరి గంత్తేసే గుడ్ న్యూస్ ఇది..!!

సినిమా ఇండస్ట్రీలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న నరేష్ గురించి ఈ మధ్యకాలంలో ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకొని మూడు పెళ్లిలు పెటాకులు అవ్వడంతో ఆయన పేరుని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు జనాభా . అయితే అలాంటివి పట్టించుకోకుండా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న పవిత్ర లోకేష్ తో ఆయన సహజీవనం చేస్తున్నారు. వీళ్ళ సహజీవనం గురించి అందరికీ తెలిసిందే .

రీసెంట్ గానే వీరిద్దరూ కలిసి “మళ్లీ పెళ్లి” అనే సినిమాలో కూడా నటించారు . ఈ సినిమా కమర్షియల్గా పెద్ద హిట్ కాకపోయినప్పటికీ .. నటనపరంగా అభిమానుల్ని ఆకట్టుకునింది . కాగా ఈ క్రమంలోనే పవిత్ర లోకేష్ కి సంబంధించిన మరో న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . పవిత్ర లోకేష్ రీసెంట్గా నరేష్ కు గుడ్ న్యూస్ చెప్పింది . అదేంటో కాదు ఆమె కన్నడ సాహిత్యంలో పిహెచ్ డి చేసేందుకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసింది . పవిత్రాన్ని బళ్లారి తీసుకువెళ్లి స్వయంగా హంపి కన్నడ యూనివర్సిటీలో ప్రవేశ పరీక్ష రాయించాడు ఆమె పార్ట్నర్ నరేష్.

కాగా ఇప్పుడు ఆ ప్రవేశ పరీక్ష ఫలితాలు రిలీజ్ అయ్యాయి . మొత్తంగా పవిత్ర .. నరేష్ పేరుని నిలబెట్టింది . ఆయన గర్వపడేలా పిహెచ్ డి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ లో పాస్ అయింది . అంతేకాదు మొత్తంగా 981 మంది ఈ ప్రవేశ పరీక్ష రాయిగా పవిత్రతోపాటు 259 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు . అంటే ఈ ఎగ్జామ్ ఎంత టఫ్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు . మొత్తానికి తనని ఎంతో కష్టపడి చదివించిన నరేష్ పేరుని మారుమ్రోగిపోయేలా చేస్తుంది పవిత్ర. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!1