త్రిష పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ ఖుష్బూ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిష ఈ అమ్మడి ఏజ్ పెరిగే కొద్దీ అందం ఇంకాస్త పెరుగుతుందనే చెప్ప వచ్చు .త్రిష తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా నటిస్తూ అక్కడ కూడా మంచి గుర్తింపు నే సంపాదించుకుంది. అయితే ఈమధ్య హీరోయిన్స్ కి కెరియర్ పరంగా చాలా తక్కువ టైం ఉంటోంది .వాళ్లు సక్సెస్ అవ్వటం ఆలస్యం వెంటనే పాతాళంలోకి కూడా కూరుకు పోతారు. హీరోయిన్స్ ల లైఫ్ స్టైల్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేము.

Trisha and Khushbu are food-loving friends! Check out their chat! | JFW  Just for women

ఇకపోతే త్రిష మాత్రం ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు గడుస్తోంది. అయినప్పటికీ ఈమె మాత్రం హీరోయిన్ గా తెలుగు, తమిళ సినిమాలలో అవకాశాలను కొనసాగిస్తూ బిజీగానే ఉంటోంది.ఈ క్రమంలోనే త్రిష గురించి సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.ఒక చిట్ చాట్ లో ఖుష్బూ మాట్లాడుతూ ఇండస్ట్రీలో నటీమణులు 20 ఏళ్లు కెరీయర్ని కొనసాగించడం అంటే చాలా కష్టం.. కానీ త్రిష మాత్రం 20 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే నిలబడి నెంబర్ వన్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది.త్రిష మేల్ సూపర్ స్టార్ లాగా క్రౌడ్ పుల్లర్ అంటూ కితాబిచ్చింది.

Happy Birthday Trisha Krishnan: Wishes pour in for '96' actress from Khushbu,  Aishwarya Rajesh, and others | Regional-cinema News – India TV

ఖుష్బూ, త్రిష కెరియర్ పై స్పందిస్తూ ఆమెపై ప్రశంసలు కురిపించటంతో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా త్రిష మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పోన్నియన్ సెల్వన్ .1..2.. సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకులకు చేరువయ్యింది త్రిష. త్రిష వర్షం, వస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రను వేసుకుంది. ఇప్పుడు త్రిష ప్రస్తుతానికి తమిళంలో సినిమాలను చేస్తూ చాలా బిజీగా గడిపేస్తోంది. ఏదేమైనా త్రిష ఎప్పుడూ ఇలాగే ఎవరి గ్రీన్ గా ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.