ఎన్టీఆర్ ‘ దేవ‌ర‌ ‘ పై ఫ్యీజులు ఎగిరే న్యూస్‌… తార‌క్ ఫ్యాన్స్ ర‌చ్చ షురూ…!

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ దేవర. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఓన్లీ బిఎఫ్ ఎక్స్ వర్క్ కోసమే ఏకంగా రూ.140 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేవర సినిమా దాదాపు రూ.300 కోట్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుందని తెలుస్తుంది.

మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి మాత్రం ఈ న్యూస్ ఫుల్ కిక్‌గా అనిపిస్తోంది. ఎంతైనా ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌ అంటే ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు ఉంటాయి. పైగా ఇస్క్రిప్ట్ పై వీరిద్దరూ చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు. మరి కథలో కొరటాల శివ ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో.. వీరిద్ద‌రి కాంబినేషన్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే అంశంపై ప్రేక్షకుల భారీ అంచనాలు పెరిగాయి.

ఇక ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ – కొర‌టాల‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద హిట్ కావడంతో పైగా ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా మరింత అంచనాలు పెరిగాయి.