కోట్ల‌కు అధిప‌తి అయిన జ‌గ‌ప‌తిబాబు ఇంట్లో ఉంటే చేసే ప‌నులు ఇవా..?

జ‌గ‌ప‌తిబాబు అంటే తెలియ‌ని వారుండ‌రు. హీరోగా ఓ వెలుగు వెలిగిన జ‌గ‌ప‌తిబాబు.. ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. హీరోగా ఆఫ‌ర్లు త‌గ్గిన త‌ర్వాత విల‌న్ గా మారాడు. లెజెండ్ మూవీతో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్డ్ చేశాడు. ప్ర‌స్తుతం విల‌న్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్నాడు.

స‌లార్ తో స‌హా ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ లో జ‌గ‌ప‌తిబాబు భాగం అయ్యారు. అలాగే సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ తో త‌న ఫాలోవ‌ర్స్ ను అల‌రిస్తుంటూ ఉండే జ‌గ‌ప‌తి బాబు.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు. `అంద‌రూ నేనేదో రాత్రి ప‌గ‌లు పని చేస్తున్నాను, తెగ‌ సంపాదించేస్తున్నాను అనుకుంటున్నారు క‌దా? మ‌రి ఈ ఫోటోలో నా ప‌రిస్థితి ఎందుకో నెక్స్ట్ పోస్ట్ లో చెబుతా. ఈలోపు మీరు గెస్ చేయండి` అంటూ పేర్కొంటూ ఇంటిని క్లీన్ చేసే క‌ర్ర‌ను ప‌ట్టుకుని ఉన్న‌ ఫోటోను పంచుకున్నారు.

దీంతో జ‌గ‌ప‌తి బాబు పోస్ట్ కు నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఏ బ‌ల్లినో, ఎల‌క‌నో త‌ర‌మ‌డానికి ట్రై చేస్తున్నార‌ని కొంద‌రు అంటుంటే.. కోట్ల‌కు అధిప‌తి అయిన జ‌గ‌ప‌తిబాబు ఇంట్లో ఉంటే చేసే ప‌నులు ఇవా అని మ‌రికొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. ఇక మ‌రొక‌రు `పెళ్లాం చెబితే ఎవ‌రైనా ఎంత‌టివారైనా ఏ ప‌నైనా చేయాలి` అని కామెంట్ పెట్టాడు. మొత్తానికి జ‌గ‌ప‌తి బాబు పోస్ట్ మాత్రం తెగ వైర‌ల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Jaggu Bhai (@iamjaggubhai_)