పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్‌తో నితిన్ న్యూ మూవి.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా….!!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరభిమాని. ఈ విషయాన్ని నితిన్ ఎన్నో సార్లు చెప్పాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సాంగ్స్ సైతం రీమిక్స్ చేశాడు. తాజాగా నితిన్ ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్‌తో రాబోతున్నాడు. ప‌వ‌న్ నటించిన ‘ తమ్ముడు ‘ 1999లో విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం వేణు శ్రీరామ్ డైరెక్షన్లో నితిన్ న్యూ మూవీ ప్రారంభించాడు. ఈ చిత్రం ఓపెనింగ్ పూజ కార్యక్రమాలు జరిగాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మించనున్న చిత్రమిది. ఆ సంస్థలో 56వ సినిమా. ఈ విషయాన్ని తెలియజేస్తూ నితిన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. సేమ్ టైటిల్ తో వస్తున్నాము.. చాలా బాధ్యతలు మాపై ఉన్నాయి.

మేము మీ అంచనాలకు మించి పంపిణీ చేస్తాము. శ్రీరామ్ వేణు, దిల్ రాజు గారితో నా తదుపరి చిత్రం తమ్ముడు అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశాడు. దీంతో పవన్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కొంతమంది నిటిజన్లు మాత్రం ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? నితిన్ హిట్ కొడతాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.