మంచి స్క్రిప్ట్ లాక్ చేసిన మంచు లక్ష్మి.. ఇక రికార్డులు బద్దలే..

మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లక్ష్మి మంచు తెలుగులో హీరోయిన్ గా, విలన్ గా, నిర్మాతగా కూడా చేసింది. అయితే ఈ అమ్మడు తన వ్యాఖ్యలతో ఎప్పుడు ట్రోలింగ్స్ బారిన పడుతూ ఉంటుంది. నలబై ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ పంట పండిస్తూ సోషల్ మీడియా లో అందరిని అలరిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ల కనపడుతుంది. లక్ష్మి బుల్లి తెర పై కూడా కొన్ని షోస్ కి హోస్టింగ్ చేసింది. ఇప్పుడేమో యూట్యూబ్ లో అప్పుడప్పుడు కనపడుతూ ప్రేక్షకులను అల్లరిస్తూ ఉంటుంది.

ప్రస్తుతం సినిమాలకు, షోస్ కి దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. మల్టీ టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్న మంచు లక్ష్మి ఎందుకు ఇండస్ట్రీ కి దూరంగా ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. లక్ష్మి మంచు తనకి తగిన పాత్రలు రాకపోవడం వల్లనే ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్నా అని ఇటీవలే తన స్నేహితులతో చెప్పిందట. అయితే ఆమె ప్రతిభ  ఆధారంగా దర్శకులు కథలు రాస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేసారు. తాజాగా మంచు లక్ష్మి కోసం ఒక మంచి స్క్రిప్ట్ దక్కిందట. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ పై వర్క్ జరుగుతుందట. అంతా పూర్తి అయితే త్వరలోనే లేడీ ఒరియాంటెడ్ మూవీ ప్రారంభం కాభోతుంది.

ఆ లేడీ ఒరియాంటెడ్ సినిమా కి మంచు లక్ష్మి  నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తుంది. అలానే టాలెంట్ ఉన్న ఒక వ్యక్తికి లక్ష్మి మంచు దర్శకత్వ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తుంది. ఎలా అయితేనేం చాలా రోజుల తరువాత లక్ష్మి మంచు హీరోయిన్ గా కనపడబోతుందనమాట. ఈ సందర్బంగా మంచు ఫ్యాన్స్ లక్ష్మి కి అభినందనలు తెలుపుతున్నారు. లక్ష్మి మంచు నటిస్తున్న ఈ లేడీ ఒరియాంటెడ్ సినిమా లో మంచు మనోజ్ ని గెస్ట్ రోల్ లో చూపించాలని మంచు లక్ష్మి ప్రయత్నాలు చేస్తుందని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఓకే అవుతుందో చూడాలి.