సినీ ఇండస్ట్రీ లో ఈ మధ్య వివాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండస్ట్రీ లోని సెలెబ్రేటీలు ఒకరి తరువాత ఒకరు మరణిస్తూ ఉన్నారు. సెలబ్రిటిల మరణం తో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థిస్తులు వస్తుండగా, మరి కొందరి జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రముఖ బుల్లితెర నటి పరిస్థితి కూడా అలానే అయింది. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని తీరని విషాదంలో మునిగిపోయింది. అసలు ఆ బుల్లితెర నటి ఎవరు? ఆమెకి ఏం జరిగింది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తమిళ బుల్లితెర నటి శృతి షణ్ముగ ప్రియా జీవితంలో తీరని విషాదం చోటు చేసుకుంది. శృతి, అరవింద్ శేఖర్ ఇద్దరు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత ఏడాది మే లో వీరి ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించారు. శృతి ది ఎంత దూరదృష్టమంటే పెళ్లి జరిగిన ఏడాదికే ఆమె భర్త గుండెపోటు తో మరణించాడు. దాంతో ఒక్కసారిగా శృతి ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. భర్త మరణం వళ్ల శృతిని ఒదార్చడం ఎవ్వరి తరం కావడం లేదు. భర్త మరణ వార్తను ఆమె జీర్ణించుకోలేక పోతుంది.
శృతి కెరీర్ గురించి మాట్లాడుకుంటే మొదట ‘ నటస్వరం ‘ అనే సీరియల్ తో బుల్లి తెర పై అడుగుపెట్టింది. ఆ తరువాత వాణి రాణి, కళ్యాణ పరిసు, పొన్నుచల్, భారతీ కన్నమ్మ లాంటి హిట్ సీరియల్స్ లో నటించింది. ఆమె సీరియల్స్ చేసే సమయం లో బాడీ బిల్డర్ అరవింద్ శేఖర్ తో ప్రేమలో పడింది. వీరి ప్రేమ కొన్నేళ్లకు పెళ్లిగా మారింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన శృతి పై ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శృతి షణ్ముగ ప్రియ, అరవింద్ లకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.