మ‌హేష్ హీరోయిన్‌కు పెద్ద క‌ష్టం… ఎవ్వ‌రికి వ‌ద్దంటూ క‌న్నీళ్లు…!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాస బాసు ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. మహేష్ బాబు టక్కరి దొంగ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో రాజ్, జిస్మా వంటి సినిమాల్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. 2015 లో వచ్చిన ఎలోస్ సినిమాలో క‌ర‌ణ్ సింగ్‌ గ్రోవర్‌తో కలిసి నటించింది. ఈ సినిమా షూటింగ్ టైంలో ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. థ్రిల్లర్ వెబ్ సిరీస్ డేంజర్ లోను కలిసి నటించారు. కొంతకాలం డేటింగ్ తర్వాత 2016 లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి గత ఏడాది నవంబర్ 12న ఓ పాప పుట్టింది.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన బిపాసా 2018లో వెల్కమ్ టు న్యూయార్క్ సినిమాలో గెస్ట్ రోల్ ప్లే చేసింది. ఇటీవల బిపాసా తన జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటన గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. గతేడాది నవంబర్లో ఆడ పిల్లకు జన్మనిచ్చిన బిపాస తనకు దేవి అనే పేరు పెట్టుకుంది. ఎంతో అలారు ముద్దుగా పెంచుకున్న ఆమె గారాల పట్టికి పుట్టుకతోనే హార్ట్‌లో హోల్ ఉందని తెలిసి ఎంతో బాధపడిందట.

పాపకు మూడు నెలల వయసులో తనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని వివరించింది. తల్లిగా తాను ఎదుర్కొన్న వడిదడుగుల గురించి బిపాస బాసు మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. దేవి పుట్టిన మూడు రోజులకు ఆమె హార్ట్ లో టూ హోల్స్ ఉన్నాయని తెలిసిందట‌. దాన్ని సరి చేయాలంటే సర్జరీ చేయాలి అన్నారు. ఆ బాధనంతా దిగమింగుకొని నవ్వుతూ కనిపించే వాళ్ళం. పాపకు ఉన్న డిసీస్ గురించి కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదని.. పాపరాకతో సంబరాలు జరుపు కోవాలనుకున్నమా మనసు ముక్కలైందని మొదటి ఐదు నెలలు మేము చాలా నరకం చూసామంటూ వివరించింది.

తన భర్త కరణ్ ఈ సర్జరీ చేయించడానికి సిద్ధంగా లేడు కానీ నేను మాత్రం పాప ఎంత త్వరగా దీని నుంచి బయటపడితే అంత బాగుంటుందని అనుకునా. చివ‌రికి దానికి సిద్ధమయ్యామని 6 గంటలసేపు సర్జరీ జరిగి సర్జరీ సక్సెస్ అయిందని. ఆ సర్జరీ జరుగుతున్నంత సేపు నా జీవితం ఆగిపోయినట్లు అనిపించిందని. ఎంతగానో కుమిలిపోయానని కంఠతడి పెట్టుకుంది బిపాస‌. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.