మ‌ళ్లీ ఎన్టీఆర్ వ‌ర్సెస్ రామ్ చ‌ర‌ణ్‌.. ఈసారి ఇద్ద‌రిలో తోపు ఎవ‌రో తేలిపోనుందిగా!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. రాజ‌మౌళి రూపొందించిన ఈ సినిమా ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో తెలిసిందే. ఏకంగా ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఈ మూవీతో అటు ఎన్టీఆర్‌, ఇటు రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ గ్లోబ‌ల్ స్టార్స్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ, వీరి అభిమానుల మ‌ధ్య ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో వార్స్ జ‌రుగుతూనే ఉంటాయి.

మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని మెగా మ‌రియు నంద‌మూరి అభిమానులు కొట్టుకుంటూనే ఉంటాయి. ఇప్పుడు మ‌రోసారి ఫ్యాన్స్ మ‌ధ్య ర‌చ్చ మొద‌లైంది. అందుకు కార‌ణం సైమా అవార్డ్సే. సౌత్ లో సైమా అవార్డ్స్(సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్స్‌) కు ఎంతో ప్ర‌ముఖ్య‌త ఉంది. ప్ర‌తి ఏడాది సౌత్ సినిమాలు, న‌టులు, సంకేతిక నిపుణుల ప్ర‌తిభ‌ను గుర్తించి ఈ అవార్డ్స్ ను అందిస్తుంటాయి. ఈ ఏడాది సైమా అవార్డ్స్ వేడ‌క సెప్టెంబ‌ర్ 15, 16 తేదీల్లో జ‌ర‌గబోతోంది.

అయితే సైమా టీమ్ తాజాగా అవార్డ్స్ కోసం పోటీ ప‌డుతున్న‌ ఉత్త‌మ చిత్రాల నామినేష‌న్‌ జాబితాతో పాటు తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ ఉత్తమ‌ హీరో నామినేష‌న్ల జాబితాలో విడుద‌ల చేసింది. తెలుగులో ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ – రామ్ చ‌ర‌ణ్‌, సీతారామం నుంచి దుల్క‌ర్ స‌ల్మాన్‌, మేజ‌ర్ నుంచి అడివి శేష్‌, కార్తికేయ 2 నుంచి నిఖిల్‌, డీజే టిల్లు నుంచి సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ ఉత్త‌మ హీరో అవార్డు కోసం పోటీ ప‌డుతున్నారు. అయితే నామినేష‌న్స్ లో ఇంత మంది హీరోలు ఉన్నా.. అంద‌రి చూపులు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ పైనే ప‌డ్డాయి. వీరిద్ద‌రి మ‌ధ్యే పోటీ ఉంది. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ల‌లో ఎవ‌రు అవార్డు ద‌క్కించుకుంటే వారే తోపు అని అభిమానులు భావిస్తున్నారు. మ‌రి వీరిలో ఎవ‌రిని సైమా అవార్డు వ‌రిస్తుందో చూడాలి.