బిజినెస్ మేన్ చిత్రం తో సత్తా చూపిస్తున్న మహేష్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం బిజినెస్ మాన్.. డైరెక్టర్ పూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ చిత్రం అప్పట్లోనే ఒక ట్రెండు ని సెట్ చేసిందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా మళ్లీ బిజినెస్ మ్యాన్ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి సిద్ధమైనారు చిత్ర బృందం. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తారీఖున ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Watch Businessman - Disney+ Hotstar

అందుకోసం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభించక వైజాగ్ లో సంఘం థియేటర్లు ఉదయం 7:30 గంటలకు సంబంధించిన టికెట్లు ఘంట వ్యవధిలోని అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.. సంఘం మరియు శరత్ థియేటర్లో సినిమాని భారీ ఎత్తున అభిమానులు చూడబోతున్నట్లు సమాచారం. మహేష్ సినిమాలు రీ రిలీజ్ అయిన దాఖలు చాలానే ఉన్నాయి..అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.. ఈ అడ్వాన్స్ బుకింగ్ అందుకు నిదర్శనం అంటూ పలువురు అభిమానుల సైతం ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్నారు.

Businessman (Telugu) (Re: 2023) | Book tickets at Cineworld Cinemas

బిజినెస్ మాన్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. అప్పట్లో ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి సంగీతాన్ని తమన్ అందించారు. అతి తక్కువ సమయంలో రూపొందించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన కారణంగా నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు సైతం ఈ సినిమా మంచి లాభాలను తెచ్చి పెట్టినట్టు తెలుస్తోంది. మరి రీ రిలీజ్ కలెక్షన్లలో ఎలాంటి హవా సృష్టిస్తుందో చూడాలి మరి.