నేహా శర్మ.. ఈ ముద్దుగమ్మ గుర్తుందా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ `చిరుత`తోనే నేమా శర్మ కూడా సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతో అందరినీ ఆకట్టుకుంది. డబ్బు ఉన్న పొగరుబోతు హీరోయిన్ గా అదరగొట్టింది. ఆ తర్వాత కుర్రాడు అనే మూవీ మెరిసింది. అంతే ఇక ఇక్కడ కనిపించలేదు. బాలీవుడ్ కు మకాం మార్చి.. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.
అయితే దాదాపు దశాబ్దన్నర తర్వాత చిరుత పిల్ల మళ్లీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. రీసెంట్ గా ఈ అమ్మడు ఓ యంగ్ హీరో మూవీకి కమిట్ అయింది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. విశ్వక్ సేన్. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విశ్వక్ సేన్ కొద్ది రోజుల క్రితం తన 10వ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
రవితేజ ముళ్ళపూడి అనే కొత్త వ్యక్తి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఎంపిక అయింది. రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మింస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా #VS10 వర్కింగ్ టైటిల్ తో హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాతోనే నేహా శర్మీ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందులో ఆమె ఒక కీలక పాత్రను పోషిస్తోంది. త్వరలోనే ఆమె షూటింగ్ లో సైతం జాయిన్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.