విజ‌య్ – సామ్‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌క్కా.. బ్యూటిఫుల్ ‘ ఖుషీ ‘ ట్రైల‌ర్ ( వీడియో )

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత జంట‌గా నటించిన మూవీ ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించబడిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొల్పాయి.

కొంత సేప‌టి క్రితం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ టీం. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా మంచి అనుభూతితో ఉంది. రొమాన్స్, ఫ‌న్‌, ఫ్యామిలీ సెంటిమెంట్‌ అన్ని ఎలిమెంట్స్ జోడించిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఫన్నీ వేలో చూపించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది. ట్రైలర్‌ చూస్తే సమంత – విజయ రొమాన్స్ బాగా వర్కౌట్ అయినట్లు తెలుస్తుంది.

తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా హేషం అబ్దుల్ వహాబ్ వ్యవహరించారు. టీజర్, ఫస్ట్ లుక్ తోనే మంచి అంచనాలను తెచ్చుకున్న ఈ సినిమా ట్రైలర్ తో మరిన్ని ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. విజయ్ సామ్‌కి ఈ సినిమాతో బ్లాక్ పాస్టర్ పక్క అనిపించే విధంగా ట్రైలర్ అదరగొట్టింది.